ఉత్సాహంగా ‘రన్‌ఫర్ యూనిటీ’
బస్సులు రావు.. బడికి ఎలా వెళ్లేది?
నర్సాపూర్: ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవడంతో పాఠశాలకు వెళ్లలేకపోతున్నామని మండలంలోని జక్కపల్లి ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోడల్ స్కూల్‌కు నర్సాపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు రోజూ బస్సుల్లో వెళ్లి చదువులు కొనసాగిస్తున్నారు. కాగా నర్సాపూర్ నుంచి వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ అధికారులు నాలుగు బస్సులు నడుపుతామని చెప్పినా, ఒక్కో రోజు మూడు బస్సులే వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. సమయపాలన పాటించకపోవడంతో సకాలంలో బడికి వెళ్లలేక పోతున్నామని వాపోతున్నారు. ఆటోల్లో పంపాలంటే భయమేస్తుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ మున్సిపాలిటీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రన్ ఫర్ యూనిటీ’ ఉత్సాహంగా సాగింది. మెదక్‌లో ఉదయం నిర్వహించిన 2కే రన్‌లో యువత, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ మహేందర్ ప్రారంభించారు. బోధన్ చౌరస్తా నుంచి ప్రారంభమై పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద ముగిసింది. అలాగే పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని పీఎన్‌ఆర్ స్టేడియంలో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఏఆర్ డీఎస్పీ రంగనాయక్ క్రీడాకారులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా ‘రన్‌ఫర్ యూనిటీ’


