జాతీయస్థాయి అడ్వెంచర్‌ క్యాంపునకు డిగ్రీ విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి అడ్వెంచర్‌ క్యాంపునకు డిగ్రీ విద్యార్థి

Nov 1 2025 8:51 AM | Updated on Nov 1 2025 8:51 AM

జాతీయ

జాతీయస్థాయి అడ్వెంచర్‌ క్యాంపునకు డిగ్రీ విద్యార్థి

నర్సాపూర్‌ రూరల్‌: జాతీయస్థాయి అడ్వెంచర్‌ క్యాంపునకు నర్సాపూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఎస్సీ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థి జరుపుల ప్రభాకర్‌ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ హుస్సేన్‌ శుక్రవారం తెలిపారు. ఈనెల 10 నుంచి 19వ తేదీ వరకు హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో జరిగే క్యాంపులో పాల్గొననున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్‌తో పాటు ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సురేశ్‌ కుమార్‌, అధ్యాపకులు, మురళి, శ్రీలత, సిబ్బంది అభినందించారు. కళాశాలకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని అకాంక్షించారు.

నేడు కాటేజీలు ప్రారంభం

నర్సాపూర్‌: అర్బన్‌పార్కులో అటవీశాఖ నిర్మించిన కాటేజీలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. శనివారం మంత్రులు కొండా సురేఖ, వివేక్‌, మంత్రి దామోదర రాజనర్సింహ, మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌తో పాటు పలువురు అటవీశాఖ అధికారులు ప్రారంభించనున్నారు. ఇదిలాఉండగా మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీస్‌, ఆయా శాఖల అధికారులు శుక్రవారం అర్బన్‌పార్కులో నిర్వహించే ఏరియాను పరిశీలించారు.

ప్రైవేటీకరణ విరమించుకోవాలి

తూప్రాన్‌: కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్క్‌లు) ప్రైవేటీకరణకు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని తె లంగాణ స్టేట్‌ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం యూనియన్‌ నాయకులతో కలిసి మాట్లాడారు. అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్‌ పంపిణీ సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 1 లక్ష కోట్ల బెయిలౌట్‌ ప్యాకేజీను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమలు చేయని రా ష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వాపోయారు. సమావేశంలో యూనియన్‌ సలహాదారులు స్వామి, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కొనుగోళ్లు వేగవంతం చేయండి: ఆర్డీఓ

చిన్నశంకరంపేట(మెదక్‌): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మెదక్‌ ఆర్డీఓ రమాదేవి ఆదేశించారు. శుక్రవారం మండలంలోని అంబాజిపేట, మడూర్‌లో కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త్తకుండా ధాన్యాన్ని వెంట వెంటనే కాంటా చేసి రైస్‌ మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేసి భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని తెలిపారు. అనంతరం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పరిశీలించి తహసీల్దార్‌ మాలతికి పలు సూచనలు చేశారు.

నిండుకున్న ఇసుక నిల్వలు

నర్సాపూర్‌: శాండ్‌ బజార్‌లో ఇసుక నిల్వలు ని ండుకున్నాయి. మైనింగ్‌శాఖ అధికారుల నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిరంతరం ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కోరుతున్నారు. ఈవిషయమై ఇసుక బజార్‌ ఇన్‌చార్జి రాకేశ్‌ను వివరణ కోరగా.. శనివారం నుంచి అందుబాటులో ఉంచు తామని చెప్పారు.

జాతీయస్థాయి అడ్వెంచర్‌ క్యాంపునకు డిగ్రీ విద్యార్థి 
1
1/4

జాతీయస్థాయి అడ్వెంచర్‌ క్యాంపునకు డిగ్రీ విద్యార్థి

జాతీయస్థాయి అడ్వెంచర్‌ క్యాంపునకు డిగ్రీ విద్యార్థి 
2
2/4

జాతీయస్థాయి అడ్వెంచర్‌ క్యాంపునకు డిగ్రీ విద్యార్థి

జాతీయస్థాయి అడ్వెంచర్‌ క్యాంపునకు డిగ్రీ విద్యార్థి 
3
3/4

జాతీయస్థాయి అడ్వెంచర్‌ క్యాంపునకు డిగ్రీ విద్యార్థి

జాతీయస్థాయి అడ్వెంచర్‌ క్యాంపునకు డిగ్రీ విద్యార్థి 
4
4/4

జాతీయస్థాయి అడ్వెంచర్‌ క్యాంపునకు డిగ్రీ విద్యార్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement