Actress Aditi Rao Hydari Reveals About Her First Film - Sakshi
Sakshi News home page

Aditi Rao Hydari: ఆమె చూస్తే తట్టుకోలేదని బాత్‌రూమ్‌కు వెళ్లి ఏడ్చేదాన్ని: అదితి రావు

Published Sun, Oct 30 2022 3:30 PM | Last Updated on Sun, Oct 30 2022 4:16 PM

Actress Aditi Rao Hydari Reveals About Her First Film  - Sakshi

తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అదితి రావు‌ హైదరీ. ఇటీవలే ఈ నటుడు సిద్ధార్థ్‌తో డేటింగ్‌ ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా జరిగిన మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లలడించారు. తాను సినిమాల్లోకి రావడానికి ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అదితిరావు వెల్లడించారు. 

(చదవండి: ఆ అమ్మాయి కనిపిస్తే దయచేసి నాకు చెప్పండి.. రాజ్ తరుణ్ వీడియో వైరల్)

అదితి రావు మాట్లాడుతూ..' నేను మొదట భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించా. ఆ తర్వాత దేశవ్యాప్తంగా చాలా ప్రదర్శనలు చేశా. వీటన్నింటిని చూసిన తమిళ దర్శకురాలు శారద నాకు హీరోయిన్‌గా మొదటి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమా విడుదల చాలా ఆలస్యమైంది. ఈ విషయంలో నేను చాలా బాధపడేదాన్ని. మొదటి మూవీ కావడంతో ఫీలయ్యేదాన్ని. మా అమ్మ ముందు నేను ఏడిస్తే తాను తట్టుకోలేదని బాత్‌ రూమ్‌కు వెళ్లి ఏడ్చేదాన్ని' అని తెలిపింది.

(చదవండి: సూర్య- ఇనయ లవ్‌ భాష.. ఏంటో అర్థం కావట్లేదన్న నాగ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement