
హీరోయిన్ అనగానే సన్నగా మెరుపు తీగలా ఉండే వాళ్లే గుర్తొస్తారు. ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు మాత్రం దాదాపు హీరోయిన్లు అందరూ నాజుగ్గానే కనిపిస్తుంటారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే బాడీని మెంటైన్ చేస్తోంది. అనుకోకుండా ఈ హీరోయిన్ పాత ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అప్పటికీ ఇప్పటికీ ఈమెలో మార్పుని చూసి అందరూ షాకవుతున్నారు. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు కల్యాణి ప్రియదర్శన్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే కానీ గుర్తురావట్లేదే అనుకుంటున్నారా? అక్కినేని అఖిల్ 'హలో', సాయిధరమ్ తేజ్ 'చిత్రలహరి' సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది ఈ అమ్మాయే. అయితే ఈ రెండు మూవీస్ తర్వాత టాలీవుడ్‌లో ఈమెకు పెద్దగా కలిసిరాలేదో ఏమో గానీ సొంతూరికి వెళ్లిపోయింది. మలయాళంలో వరస సినిమాలు చేస్తూ స్టార్ అయిపోయింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?)
మలయాళంలోని స్టార్ హీరోలు చాలామందితో కల్యాణి నటించేసింది. తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ చేయనప్పటికీ ఓటీటీల్లో డబ్బింగ్ చిత్రాల వల్ల తెలుగు ప్రేక్షకులు ఈమెని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడంటే మంచి ఫిజిక్‌తో ఉంటూ అభిమానుల్ని అలరిస్తున్న కల్యాణి ప్రియదర్శన్.. సినిమాల్లోకి రాకముందు మాత్రం బొద్దుగా ఉండేది. అప్పటి, ఇప్పటి ఫొటోలు పక్కపక్కన పెట్టి చూస్తే ఇద్దరూ ఒకరేనా అని మీరు అనుకోవడం పక్కా.
ఇకపోతే కల్యాణి తండ్రి ప్రియదర్శన్ ప్రముఖ దర్శకుడు కాగా తల్లి లిజీ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలు చేసింది. అలా సినిమా ఫ్యామిలీలో పుట్టిన కల్యాణి.. తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా సినిమాలు చేస్తోంది. సో అదన్నమాట విషయం.
(ఇదీ చదవండి: లండన్‌లో ప్రభాస్ కొత్త ఇల్లు.. నెలకు అన్ని లక్షల అద్దె?)
Transformation!!👌🔥 pic.twitter.com/4sjmKINI6V
— Christopher Kanagaraj (@Chrissuccess) February 25, 2024
Comments
Please login to add a commentAdd a comment