పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే? | Actress Mehreen Pirzada Wedding With Arsh Aulakh In Private Ceremony, Know About Details And Marriage Photos Viral | Sakshi
Sakshi News home page

Mehreen Wedding: సడన్ సర్‌ప్రైజ్.. పెళ్లి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్

Apr 26 2026 8:55 PM | Updated on Apr 27 2026 3:11 PM

Actress Mehreen Pirzada Wedding And Husband Details

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి చేసుకుంది. గతంలో మాజీ సీఎం మనవడితో నిశ్చితార్థం చేసుకుని రద్దు చేసుకున్న ఈమె ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ రిసార్ట్‌లో ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగ్గా.. ఆ ఫొటోలని ఇప్పుడు పంచుకుంది. తన భర్త అర్ష్ ఔలక్‌ని పరిచయం చేసింది. ఈమె భర్తకు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)

పంజాబ్‌కి చెందిన మెహ్రీన్.. నాని 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత ఎఫ్ 2, ఎఫ్ 3, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, పంతం, కవచం, చాణక్య, ఎంత మంచివాడవురా, అశ్వద్ధామ, మంచి రోజులొచ్చాయి, స్పార్క్ లైఫ్ మూవీస్ చేసింది. తమిళ, హిందీ, పంజాబీ, కన్నడలో పలు చిత్రాల్లో నటించింది.

ఇకపోతే హరియాణాకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన భజన్ లాల్ మనవడు అయిన భవ్య బిష్ణోయ్‌తో 2021 మార్చిలో మెహ్రీన్‌కి నిశ్చితార్థం జరిగింది. కానీ ఏమైందో ఏమో దీన్ని రద్దు చేసుకున్నారు. అనంతరం భవ్య పరి అనే ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మెహ్రీన్ కూడా అర్ష్ అనే వ్యక్తితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతానికైతే మెహ్రీన్ చేతిలో కొత్త సినిమాలేం లేవు. చూస్తుంటే నటనకు రిటైర్మెంట్ ఇచ్చేలానే ఉంది.

(ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి)

Advertisement
 
Advertisement
Advertisement