Nayanthara Birthday Special: Sakshi Special Story Details In Telugu - Sakshi
Sakshi News home page

Nayanthara Birthday Special: డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ నయన్‌ ‘తార’

Published Thu, Nov 18 2021 9:47 AM | Last Updated on Thu, Nov 18 2021 11:57 AM

Actress Nayanthara Birthday Sakshi Special Story

సాక్షి, హైదరాబాద్‌: అందం, అభినయంతో పాటు స్వశక్తితో ఎదిగిన అందాల తార నయనతార. ఆమెపై తెరపై కనిపించగానే ఫ్యాన్స్‌కు నయనానందకరమే. తనదైన వ్యక్తిత్వంతో దూసుకుపోతున్న అగ్రకథానాయిక.  సౌత్‌లో అగ్రహీరోలందరితోనూ జతకట్టడమే కాదు,  దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్‌ హీరోయిన్. లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన ఈ కేరళ కుట్టి  పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి. (VikkyNayan: విక్కీ సర్‌ప్రైజ్‌, బర్త్‌డే బ్యాష్‌ మామూలుగా లేదుగా)

నయనతార అసలు పేరు డయానా మారియమ్‌ కురియన్‌. 1984 నవంబరు 18న బెంగళూరులో జన్మించిన ఈమెది కేరళ కుటుంబ నేపథ్యం. తండ్రి కురియన్‌ కొడియట్టు ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి. తల్లి ఒమన్‌ కురియన్‌. చిన్నప్పటి నుండే  మోడలింగ్‌ అంటే ఆసక్తి ఉన్న నయన్‌కాలేజీ రోజుల్లో నేమోడలింగ్ చేసింది.  సినిమాలంలే పెద్దగా ఆసక్తి లేకపోయినా మళయాళంలో విడుదలైన 'మనస్పినక్కరే' సినిమాతో ఆమె వెండితెరకు పరిచయమైంది. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూడలేదు.

ఆ తరువాత తమిళ, మళయాళీ భాషల్లో  సూపర్‌హిట్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అగ్రహీరోలతో సమానంగా  రెమ్యూనరేషన్‌  తీసుకునే స్టేజ్‌కు చేరుకుంది. కుర్ర హీరోలనుంచి  స్టార్‌ హీరోలు దాకా నయనతారతో   కలిసి  నటించేందుకు  ఆసక్తి చూపుతున్నారంటే ఈ భామ క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement