అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు | Actress Noor Malabika Passed Away Latest News | Sakshi
Sakshi News home page

Noor Malabika: కుళ్లిన స్థితిలో శవమై కనిపించిన నటి.. అసలేం జరిగింది?

Published Mon, Jun 10 2024 1:22 PM | Last Updated on Mon, Jun 10 2024 1:31 PM

Actress Noor Malabika Passed Away Latest News

ప్రముఖ యువ నటి నూర్ మాళబిక (32) అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. ముంబయిలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్న ఈమె ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ప్రాణాలు వదిలేసింది. అయితే నూర్ బాడీ కుళ్లిన స్థితిలో ఉన్నప్పుడు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. నూర్ కుటుంబ సభ్యులు కనీసం ఈమెని చూడటానికి కూడా రాలేదు. ఇప్పుడిదే పలు అనుమానాలకు తావిస్తోంది.

అసోంకి చెందిన నూర్ మాళవిక.. ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో పలు అడల్ట్ సిరీస్, సినిమాల్లో నటించింది. కానీ గతేడాది 'ద ట్రయల్' వెబ్ సిరీసులో నటించి మంచిగానే గుర్తింపు తెచ్చుకుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)

ఏమైందో ఏమో మరి ముంబయిలోని ఈమె ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. కానీ ఈమె బాడీ నుంచి దుర్వాసన రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. వాళ్లు శవాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇది ఆత్మహత్య అని అనుమానపడుతున్నారు.

నూర్ చనిపోవడానికి రెండు వారాల ముందే కుటుంబ సభ్యులు.. ముంబయిలోని ఈమె ఇంటికి వచ్చి వెళ్లారు. ఇప్పుడు ఈమె చనిపోయిన తర్వాత పోలీసులు వాళ్లకు ఫోన్ చేసి బాడీని తీసుకెళ్లమని చెబితే పట్టించుకోలేదు. దీంతో ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ఈమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో గొడవ పడిన తర్వాతే నూర్ చనిపోవడం కాస్త డౌట్ అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: నటి ఇంట్లో చోరీ.. 10 తులాల బంగారం, డబ్బు దొంగతనం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement