హీరోయిన్ సాయిపల్లవి పెళ్లి రూమర్స్.. అసలేం జరిగింది? | Actress Sai Pallavi Got Married Secretly? Here's The Truth Behind Viral Photo - Sakshi
Sakshi News home page

Sai Pallavi Wedding: సాయిపల్లవి మ్యారేజ్.. క్లారిటీ ఇచ్చిన ఆ డైరెక్టర్

Published Wed, Sep 20 2023 4:58 PM | Last Updated on Wed, Sep 20 2023 5:13 PM

 Actress Sai Pallavi Wedding Rumours Pic Viral - Sakshi

హీరోయిన్ సాయిపల్లవి పేరు చెప్పగానే ప్రేమమ్, ఫిదా లాంటి అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. గతేడాది వేసవిలో ఓ రెండు సినిమాలతో అలరించిన ఈమె.. ఆ తర్వాత బయట ఎక్కడా కనిపించలేదు. దీంతో పెళ్లి కోసమే బ్రేక్ తీసుకుందని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా మెడలో దండతో సాయిపల్లవి ఉన్న ఓ ఫొటో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఆమెకు పెళ్లి అయిపోయిందా అనుకుంటున్నారు. ఇంతకీ నిజమేంటి?

ఏం జరిగింది?
'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా మారిన సాయిపల్లవి.. 'ఫిదా'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మిడిల్ క్లాస్ అబ్బాయి, పడిపడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ లాంటి మూవీస్ చేసింది. గతేడాది చివరగా 'విరాటపర్వం' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ తర్వాత మరో తెలుగు సినిమా ఒప్పుకోలేదు. దీంతో నటన పక్కనబెట్టేసిందని, పెళ్లి చేసుకుబోతుందని రూమర్స్ వచ్చాయి.

(ఇదీ చదవండి: ఆ సీన్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: సదా)

అది పెళ్లి ఫొటోనా?
అయితే 'విరాటపర్వం', 'గార్గీ' చిత్రాల తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న సాయిపల్లవి.. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్, తెలుగులో నాగచైతన్యతో సినిమాలు చేస్తోంది. అయితే రీసెంట్‌గా సాయిపల్లవి, మరో వ్యక్తి దండలతో ఉన్న ఫొటో ఒకటి వైరల్ అయింది. అయితే అందరూ అనుకుంటున్నట్లు అది సాయిపల్లవి పెళ్లి ఫొటో కాదు, శివకార్తికేయన్ సినిమా పూజా కార్యక్రమంలోని ఫొటో. కానీ కొందరు ముందు వెనక చూడకుండా ఈమెకు పెళ్లయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. 

డైరెక్టర్ క్లారిటీ
'విరాటపర్వం' దర్శకుడు వేణు ఊడుగుల కూడా.. సాయిపల్లవి పెళ్లి రూమర్‌పై పరోక్షంగా స్పందించాడు. అయితే ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా.. అసలు ఫొటో ఇదిగో అని చెప్పి, ఫుల్ ఫొటోని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఈమె ఫ్యాన్స్.. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్య సినిమాలో ఈమెని హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement