Tania Chatterjee Biography: బోల్డ్‌ సీన్స్‌ కష్టమైనా 100% ఇస్తాను - Sakshi
Sakshi News home page

Tania Chatterjee: బోల్డ్‌ సీన్స్‌ కష్టమైనా 100% ఇస్తాను: వెబ్‌ స్టార్‌

Published Sun, Dec 26 2021 8:34 AM | Last Updated on Sun, Dec 26 2021 10:48 AM

Actress Tania Chatterjee Biography, Movies - Sakshi

కలలు అందరూ కంటారు. నెరవేర్చుకున్న వాళ్లే ప్రపంచానికి పరిచయం అవుతారు. ఆ జాబితాలోని అచీవరే.. వెబ్‌స్క్రీన్‌ స్టార్‌ తానియా ఛటర్జీ. 

పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కోల్‌కతాలోనే.  కోల్‌కతా యూనివర్సిటీలో డిగ్రీ చేసింది. చిన్నప్పటి నుంచి డాన్స్‌ అంటే చాలా ఇష్టం. కొంతకాలం శిక్షణ కూడా తీసుకుంది. హీరోయిన్‌ కావాలనుకున్న తన కలను నిజం చేసుకోవడానికి ముంబై చేరింది. ఒకవైపు చిన్న చిన్న షోలు, మోడలింగ్‌ చేస్తూనే సినిమా చాన్స్‌ల కోసం ప్రయత్నించింది. 2017లో ‘అమి జె కె తొమా’ అనే బెంగాలీ సినిమాతో వెండితెర మీద కనిపించింది.  

మొదటి సినిమాలోనే అద్భుతంగా నటించడంతో అవకాశాలు ఆమె దరిచేరాయి. వరుసగా మరో రెండు బెంగాలీ సినిమాలు, ఆల్బమ్స్‌ చేస్తూ బిజీగా మారింది. అవన్నీ విజయం సాధించాయి. దీంతో బాలీవుడ్‌ ఆమెకు స్వాగతం పలికింది. 2019లో ‘ఫ్లాట్‌మేట్స్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, తన సత్తా చాటింది. వెబ్‌ దునియాలోకీ అడుగుపెట్టి, ‘గన్స్‌ అండ్‌ లవర్స్‌’, ‘గందీ బాత్‌ 4’ సిరీస్‌లతో అలరిస్తోంది. 

పాత్ర ఏదైనా దానికి వందశాతం న్యాయం చేయాలి అని నేను నమ్ముతాను. అందుకే, బోల్డ్‌ సీన్స్‌లో నటించడం కాస్త ఇబ్బందిగా అనిపించినా.. నా వందశాతం నేను ఇస్తా. – తానియా ఛటర్జీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement