తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న చిత్రం ‘ఇంటింటి రామాయణం’. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆహాలో డిసెంబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ‘‘ఈ కథ మీ హృదయానికి హత్తుకోవటమే కాదు.. మీరు ప్రేమించిన వ్యక్తులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుకు తెస్తుంది. నేటి రోజుల్లో మన వ్యక్తిగత జీవితాల్లోని భావోద్వేగాలను ఎమోజీల రూపంలో వ్యక్తం చేస్తున్నాం.
కానీ ఆహాలో రాబోతున్న ఈ ఇంటింటి రామాయణం సినిమాను వీక్షించినప్పుడు మీ ఇంటి సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడతారు. ఒకవేళ వారు ఇతర ప్రాంతాల్లో ఉంటే వెంటనే టికెట్ బుక్ చేసుకుని వెళ్లి వారిని కలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. అంత సరళంగా అందరికీ అర్థమయ్యేలా ఉండటమే ఈ సినిమా ప్రధాన బలం’’ అన్నారు. గ్రామీణ మధ్య తరగతి జీవిత కథలను ప్రతిబింబించే సినిమాయే ఇంటింటి రామాయణం అని అర్థమవుతోంది.
కథ విషయానికి వస్తే.. కరీంనగర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అక్కడ గ్రామంలో ఉండే రాములు (నరేష్).. అతని పక్కనుండే కుటుంబం ఓ సమస్యను ఎదుర్కొంటుంది. దీంతో వారిలో ఒకరినొకరు అనుమానపడతారు. అలాంటి సమయంలో వారిలో భావోద్వేగాలు ఎలా ఉంటాయి. అవి వారి కుటుంబ సభ్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనేదే ప్రధాన కథాంశం.
చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న మాచర్ల నియోజకవర్గం
కాంతారావుకు అమ్మాయిల పిచ్చి? అసలు నిజమేంటంటే?
Comments
Please login to add a commentAdd a comment