
రామ్‌చరణ్ డ్యాన్స్ అంటే ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎంత క్లిష్టమైన స్టెప్ అయినా సునాయాసంగా చేసేస్తారు. అటు బాలీవుడ్‌కి వెళితే కథానాయికల్లో బాగా డ్యాన్స్ చేయగలిగేవాళ్లల్లో ఆలియా భట్ ఒకరు. ఇప్పుడు రామ్‌చరణ్–ఆలియా పోటాపోటీగా డ్యాన్స్ చేయనున్నారని సమాచారం. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం)లో చరణ్–ఆలియా ఓ జంటగా, ఎన్టీఆర్–ఒలీవియా మోరిస్ ఓ జంటగా నటిస్తున్నారు. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
కాగా ఏప్రిల్‌లో రామ్‌చరణ్–ఆలియా భట్‌పై రెండు పాటలు చిత్రీకరించేందుకు రాజమౌళి ప్రణాళిక సిద్ధం చేశారట. వాటిలో ఒకటి రొమాంటిక్ సాంగ్ అని టాక్. ఒక పాటను ఆలియా స్వయంగా పాడనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆమె పాడనున్నది హిందీ వెర్షన్‌కి సంబంధించిన పాట అని సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ 13న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా విడుదలకానుంది.
Comments
Please login to add a commentAdd a comment