Allu Arjun Receives Birthday Wishes From David Warner And His Daughter In Pushpa Style - Sakshi
Sakshi News home page

David Warner: బన్నీ బర్త్‌ డే.. క్యూట్‌గా విష్ చేసిన వార్నర్ కూతురు

Published Sat, Apr 8 2023 6:39 PM | Last Updated on Sat, Apr 8 2023 7:01 PM

Allu Arjun birthday wishes from David Warner daughter in Pushpa style - Sakshi

ఇవాళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ బర్త్‌ డే కావడంతో అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఉదయాన్నే అల్లు అర్జున్ ఇంటిముందు హల్‌చల్‌ చేశారు. బన్నీకి బర్త్ డే విషెస్ చెబుతూ ఫ్యాన్స్ కేక్ కూడా కట్‌ చేశారు. బన్నీ బర్త్‌డేకు పుష్ప-2 చిత్రబృందం అదిరిపోయే ‍అప్‌డేట్స్‌ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాలకు మనదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ వీరాభిమానులు ఉన్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. పుష్ప డైలాగ్స్‌, సాంగ్స్‌కు ఫిదా అయినా డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలోనూ రీల్స్ పోస్ట్ చేస్తుంటారు. ఏప్రిల్ 08న బన్నీ బర్త్‌ డేకు తనదైన స్టైల్లో గ్రాండ్ విషెస్ చెప్పారు డేవిడ్ వార్నర్.

ఇన్‌స్టాలో తన కూతురితో కలిసి విష్ చేస్తున్న ఓ వీడియోను పోస్ట్ చేశారు. పుష్పకు హ్యాపీ బర్త్‌ డే అంటూ వార్నర్ కూతురు చాలా క్యూట్‌గా చెప్పడం చేస్తుంటే బన్నీ అంటే ఎంత అభిమానమో అర్థమవుతోంది. వార్నర్ తన ఫ్యామిలీతో కలిసి పుష్ప సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ అలరిస్తుంటారు. తాజాగా బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement