Allu Arjun Tests Negative For COVID-19,Urges Everyone To Be Safe - Sakshi
Sakshi News home page

బన్నీకి నెగెటివ్‌.. పిల్లలతో కలిసి ఎమోషనల్‌ వీడియో

Published Wed, May 12 2021 11:48 AM | Last Updated on Wed, May 12 2021 1:26 PM

Allu Arjun Tests COVID Negative: Shared A Post In Instagram And Expresses Gratitue - Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ సెలబ్రిటీల మీద కన్నేసినట్లుంది. ఈ ఏడాది ఎంతోమంది సినీప్రముఖులకు కరోనా సోకింది. ఈ క్రమంలో పలువురూ ఆ మహమ్మారిని జయించలేక కన్నుమూయడంతో చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఇదిలా వుంటే తెలుగు హీరోలు పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే కదా. తాజాగా అల్లు అర్జున్‌ ఆ వైరస్‌ను జయించానంటూ అభిమానులకు శుభవార్త తెలిపాడు.

15 రోజుల క్వారంటైన్‌ తర్వాత చేసిన కోవిడ్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిందన్నాడు. ఈ సందర్భంగా తనకోసం ప్రార్థించిన అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. కరోనా కేసులు తగ్గేందుకు లాక్‌డౌన్‌ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండి ప్రాణాలు కాపాడుకోండి అని సూచించాడు. ఇక పదిహేను రోజులు పిల్లలకు దూరంగా ఉన్న బన్నీ నేడు కరోనా సంకెళ్లు తెంచుకోవడంతో వారిని ఆప్యాయంగా హత్తుకున్నాడు. పిల్లలిద్దరినీ ప్రేమగా దగ్గరకు తీసుకుని వారితో సరదాగా ఆడుకున్నాడు.

ఇదిలా వుంటే ఐకాన్‌ స్టార్‌ బన్నీ లారీ డ్రైవర్‌గా 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమో చిత్రయూనిట్‌ స్పందిస్తే కానీ తెలియదు. ఇక ఈ ఏడాది ఆగస్టు 13న విడుదలకు షెడ్యూల్‌ అయిన ‘పుష్ప’ సినిమా కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడనుందనే టాక్‌ వినిపిస్తోంది.

చదవండి: నా గురించి ఆందోళన చెందవద్దు: అల్లు అర్జున్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement