Allu Ayaan Sweet Gift To His Father Allu Arjun - Sakshi
Sakshi News home page

Allu Arjun: నా చిన్నిబాబు స్వీట్‌ గిఫ్ట్‌ ఇచ్చాడంటూ ఐకాన్‌ స్టార్‌ పోస్ట్‌

Published Sun, Feb 5 2023 3:03 PM | Last Updated on Sun, Feb 5 2023 3:34 PM

Allu Ayaan Sweet Gift to His Father Allu Arjun - Sakshi

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా లెవల్‌లో సత్తా చాటాడు అల్లు అర్జున్‌. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ కలెక్షన్ల మోత మోగించిందీ చిత్రం. పుష్ప: ది రైజ్‌ సక్సెస్‌తో దాని సీక్వెల్‌ను మరింత అద్భుతంగా తెరకెక్కించే పనిలో పడింది చిత్రయూనిట్‌. ఇటీవలే సుకుమార్‌ పుష్ప 2 సినిమా షూటింగ్‌ కూడా మొదలు పెట్టేశాడు.

ఇకపోతే తాజాగా అల్లు అర్జున్‌కు క్యూట్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు అతడి తనయుడు అయాన్‌. ఈ విషయాన్ని బన్నీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు. నా ముద్దుల కొడుకు చిన్నిబాబు నాకు క్యూట్‌ గిఫ్ట్‌ ఇచ్చాడంటూ ఓ ఫోటో షేర్‌ చేశాడు. ఆ గిఫ్ట్‌ మరేంటో కాదు.. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పుష్పరాజ్‌ లారీనే వాడుతుంటాడు కదా.. దానికి ప్రతీకగా ఓ లారీ బొమ్మను బహుమతిగా ఇచ్చాడు. అందంగా అలంకరించినట్లుగా ఉన్న ఆ బొమ్మపై పుష్ప అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారగా దీనిపై అభిమానులు స్పందిస్తూ పుష్ప 2 అప్‌డేట్‌ ఇవ్వండి బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: మంటల్లో కాలిపోతుంటే ఆ హీరో కాపాడాడు: విజయశాంతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement