బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నటించిన దో ఔర్ దో పాంచ్ సినిమా వచ్చి 43 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా అమితాబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేశాడు. అలాగే ఈ మూవీ సమయంలో తను ఎదుర్కొన్న ఓ సరదా సంఘటనను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. '2+2= 5; దో ఔర్ దో పాంచ్ సినిమా వచ్చి 43 ఏళ్లయింది. ఈ సినిమా షూటింగ్ ఎంత సరదాగా సాగిందో.. ఆ బెల్ బాటమ్ ప్యాంట్స్‌నైతే అసలు మర్చిపోలేను. ఆ ప్యాంటు వేసుకుని సినిమా చూడటానికి వెళ్లాను. అక్కడ సీటులో కూర్చున్న కాసేపటికే ఓ ఎలుక నా ప్యాంటులో దూరింది' అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేస్తూ క్యాప్షన్ ఇచ్చాడు.
ఈ పోస్ట్‌పై అభిమానులు స్పందిస్తూ.. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్.. అప్పుడు అమితాబ్ లుక్ వేరే లెవల్‌లో ఉంది, స్టైల్ ఐకాన్ సర్.. అప్పటికీ ఇప్పటికీ మీలో తేజస్సు ఏమాత్రం తగ్గలేదు, ఇప్పటికైనా బెల్ బాటమ్స్ ధరించకండి అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే దో ఔర్ దో పాంచ్ సినిమాకు రాకేశ్ కుమార్ దర్శకత్వం వహించగా సాండో ఎమ్‌ఎమ్‌ఏ చిన్నప్ప తేవర్ నిర్మించారు. 1980 ఫిబ్రవరి 8న రిలీజైన ఈ చిత్రంలో హేమమాలిని, ఖదీర్ ఖాన్, ఓం ప్రకాశ్, శ్రీరామ్ లగూ తదితరులు నటించారు.
చదవండి: డైరెక్టర్‌తో గొడవలు.. లియో నుంచి సైడయిన త్రిష? నిజమేంటంటే?
Comments
Please login to add a commentAdd a comment