
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్య బచ్చన్ కరోనా నుంచి కోలుకొని సోమవారం ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కరోనా సోకిన వీరిద్దరూ కొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండగా తరువాత స్పల్ప లక్షణాలు కనిపించడంతో ఈ నెల 17న ముంబైలోని నానావతి ఆప్పత్రిలో చేరారు. తాజాగా నిర్వహించిన కోవిడ్ పరీక్షలల్లో ఇద్దరికి నెగటివ్ రావడంతో సురక్షితంగా తమ నివాసానికి చేరుకున్నారు. కాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు సైతం జూలై 11న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ వీరు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడూ బిగ్‌బీ ట్విటర్ ద్వారా వెల్లడిస్తున్నారు. (వాళ్లిద్దరూ డిశ్చార్జ్ అయ్యారు : అభిషేక్)
ఈ క్రమంలో తన కోడలు, మనవరాలు కరోనా నెగిటివ్‌తో డిశ్చార్జ్ అయ్యారనే విషయం తెలిసి కళ్లలో నీళ్లు ఆగలేదని బిగ్ బీ అన్నారు. ఈ మేరకు అమితాబచ్చన్ ట్వీట్ చేశారు. ‘ఐశ్వర్య, ఆరాధ్య కోలుకొని ఇంటి వెళ్లారు. నా కంట్లో కన్నీళ్ళు ఆగడం లేదు. మనవరాలు నన్ను ఆలింగనం చేసుకుని ఎడవొద్దని చెప్పింది.. ’మీరు త్వరలోనే ఇంటికి వస్తారు’ అని తను నాకు భరోసా ఇచ్చింది. తన నమ్మకమే నిజం అవ్వాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఇక బిగ్ బీ కూడా త్వరగా కోలుకొని ఇంటికి వెళ్లాలని అభిమానులు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. (ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యరాయ్, ఆరాధ్య)
T 3607 - T 3607 - अपनी छोटी बिटिया , और बहुरानी को ,अस्पताल से मुक्ति मिलने पर ; मैं रोक ना पाया अपने आंसू 🙏
— Amitabh Bachchan (@SrBachchan) July 27, 2020
प्रभु तेरी कृपा अपार , अपरम्पार 🙏🙏
Comments
Please login to add a commentAdd a comment