ఆ హీరోతో ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్న లైగర్‌ బ్యూటీ | Ananya Panday Request Movie Chance With Thalapathy Vijay, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

ఆ హీరోతో ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్న లైగర్‌ బ్యూటీ

Published Mon, Jun 10 2024 6:46 AM | Last Updated on Mon, Jun 10 2024 10:15 AM

Ananya Panday Request Movie Chance With Vijay

అనుకున్నవన్నీ జరగవు.. అయినా అనుకోవడం మానుకోలేం. అలాగే మనసులోని కోరికను వ్యక్తం చేయడం కూడా తప్పు కాదు. నటి అనన్య పాండే కూడా తన మనసులోని కోరికను ఇలానే వ్యక్తం చేశారు. ప్రస్తుతం  గ్లామరస్‌ నటిగా రాణిస్తున్న బాలీవుడ్‌ బ్యూటీ ఈమె. ఈమె ఇంతకుముందు స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2, కాలీ పీవీ, డ్రీమ్‌ గర్ల్‌ 2, తెలుగు చిత్రం లైగర్‌ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ప్రస్తుతం హిందీ లో కంట్రోల్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. 

సీనియర్‌ రాజకీయ నాయకుడు, న్యాయవాది సి శంకరన్‌ నాయర్‌ బయోపిక్‌లోనూ నటిస్తున్నారు. సహజంగానే ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటించాలని కోరుకునే నటి ఈమె. ఇప్పటికే తెలుగులో లైగర్‌ చిత్రంలో నటించిన ఈమె ఇప్పుడు కోలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టీవ్‌గా ఉండే అనన్య పాండే ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ కోలీవుడ్‌లో నటుడు విజయ్‌ సరసన నటించాలనే కోరిక ఉన్నట్లు పేర్కొన్నారు. 

అయితే ఆమె కోరిక నెరవేరే చాన్సే లేదనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయ పార్టీని నెలకొల్పిన నటుడు విజయ్‌ త్వరలో రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ప్రస్తుతం గోట్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. దీని తర్వాత తన 69వ చిత్రంలో నటించి ఆ తర్వాత నటనకు స్వస్తి పలకబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే విజయ్‌ నటించే చివరి చిత్రంలో అనన్య పాండే అవకాశాన్ని ఎదురుచూస్తున్నారేమో. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆమె తన మనసులోని కోరికను వ్యక్తం చేశారా? అని అనిపిస్తుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement