నటుడితో ప్రేమ.. అమ్మకు అస్సలు ఇష్టం లేదన్న హీరోయిన్‌ | Anita Hassanandani About her Past Relationship with Eijaz Khan | Sakshi
Sakshi News home page

Anita Hassanandani: పీకల్లోతు ప్రేమలో మునిగిపోయా.. బ్రేకప్‌ నుంచి బయటపడేందుకు..

Published Fri, Sep 20 2024 7:44 PM | Last Updated on Fri, Sep 20 2024 8:32 PM

Anita Hassanandani About her Past Relationship with Eijaz Khan

నువ్వు నేను సినిమాతో తెలుగువారికి ఎంతగానో నచ్చేసింది హీరోయిన్‌ అనిత హస్సానందిని. శ్రీరామ్‌, తొట్టి గ్యాంగ్‌, నిన్నే ఇష్టపడ్డాను, ఆడంతే అదో టైప్‌, మనలో ఒకడు సినిమాలు చేసింది. తమిళ, హిందీ భాషల్లోనూ అనేక చిత్రాల్లో నటించింది. తాజాగా ఈ బ్యూటీ పెళ్లికి ముందు లవ్‌ స్టోరీని బయటపెట్టింది.

అమ్మను లెక్క చేయలేదు
గతంలో నేను ఈజాజ్‌తో రిలేషన్‌లో ఉన్నాను. మా ప్రేమవిషయం అమ్మకు తెలిసి నిరుత్సాహపడింది. మా ఇద్దరి మతాలు వేరు కావడంతో ఎప్పుడూ నా గురించి కంగారుపడుతూ ఉండేది. అయినా సరే తన భయాల్ని, అభిప్రాయాలను నేను పట్టించుకోలేదు. నిజానికి మేమిద్దరం ఎవరికి వారు బాగానే ఉన్నాం. కానీ కలిసి ఉన్నప్పుడే మా బంధం వర్కవుట్‌ కాలేదు. 

అది ప్రేమ కాదు
ఏ రిలేషన్‌లో అయినా మనల్ని వారికి నచ్చినట్లుగా మార్చుకోవాలనుకుంటే అది ప్రేమ అనిపించుకోదు. తను నన్ను మార్చాలని చూసినప్పుడు నాకసలు అర్థం కాలేదు. ఎందుకంటే నేను పీకల్లోతు ప్రేమలో కూరుకునిపోయాను. కానీ ఒకరి గురించి నేను మారలేను. నేను నాలాగే ఉండాలనుకున్నాను. దీంతో బంధం కొనసాగలేదు.

(చదవండి: ఈ బతుకే వ్యర్థం అని నిద్రమాత్రలు మింగా: బాలీవుడ్‌ నటి)

బ్రేకప్‌ నుంచి కోలుకోలేకపోయా
విడిపోయినప్పుడు ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఏడాదికి పైనే పట్టింది. ఇంట్లో ఉండలేక బెస్ట్‌ ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లిపోయాను. తనే రోజూ నన్ను ప్రేమగా నిద్ర లేపేది. అందుకే నేనిచ్చే సలహా ఏంటంటే.. ఎవరి కోసమో మనం మారనక్కర్లేదు. మనల్ని మనలాగే స్వీకరించాలి. అలాగే మీ పార్ట్‌నర్‌ ఫోన్‌పై ఓ కన్నేసి ఉంచండి. వారు ఫోన్‌ దాస్తూ, చేతికి ఇవ్వడానికి భయపడుతున్నారంటే ఏదో తప్పు జరుగుతున్నట్లే లెక్క. 

అలా మొదలైంది..
కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉంచుతున్నాడంటే కూడా తను మనకు కరెక్ట్‌ పర్సన్‌ కాదని తెలుసుకోండి అని సూచనలు ఇచ్చింది. కాగా అనిత, ఇజాజ్‌.. కావ్యాంజలి సీరియల్‌లో కలిసి నటించారు. కొన్నాళ్లపాటు డేటింగ్‌ చేసిన ఈ జంట 2007లో విడిపోయింది. తర్వాత అనిత 2013లో రోహిత్‌ రెడ్డిని పెళ్లాడింది. వీరికి 2021లో ఆరవ్‌ అనే బాబు జన్మించాడు.

బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement