నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్‌పై స్పందించిన న‌టి | Sakshi
Sakshi News home page

Anna Rajan: ఆ వ్యాధితో బాధ‌ప‌డుతున్న న‌టి.. అలాంటి కామెంట్స్ చేయొద్దంటూ..

Published Sat, May 4 2024 3:22 PM

Anna Rajan Reacts on Body Shaming, Reveals Suffering from Autoimmune Thyroid Disease

సినిమా న‌చ్చ‌న‌ప్పుడు బాలేద‌ని విమర్శించ‌డం త‌ప్పు కాదు. కానీ కొంద‌రు వారిని వృత్తిపరంగా కాకుండా వ్య‌క్తిగ‌తంగా దూషిస్తుంటారు. లుక్కు బాలేద‌ని, లావైపోయావ‌ని.. ఇలా ఎన్నో మాట‌లంటారు. మ‌రీ ముఖ్యంగా న‌టీమ‌ణుల‌పైనే విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెడుతుంటారు. దాదాపు ప్ర‌తి హీరోయిన్‌, న‌టీమ‌ణులు ఎప్పుడో ఓసారి ఇలాంటి ప‌రిస్థితుల బారిన ప‌డిన‌వారే!

న‌టిపై ట్రోలింగ్‌
తాజాగా మ‌ల‌యాళ న‌టి అన్నా రేష్మ రాజ‌న్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నువ్వు ఎంత లావున్నావో తెలుసా?  ఆ బరువుతో డ్యాన్స్ కూడా చేయ‌లేక‌పోతున్నావ్‌.. నీక‌స‌లు స్టెప్పులేస్తూ రీల్స్ చేయ‌డం అవ‌సర‌మా? అని వెక్కిరించారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై న‌టి స్పందించింది. తాను ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్లు వెల్ల‌డించింది.

వీడియో న‌చ్చ‌క‌పోతే..
ఇప్ప‌టికే కీళ్ల‌నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నాన‌ని, ఇప్పుడిలాంటి కామెంట్స్ చేసి త‌న‌ను మ‌రింత బాధ‌పెట్టొద్ద‌ని కోరింది. నేను లేదా నా డ్యాన్స్‌ వీడియో న‌చ్చ‌క‌పోతే చెప్పండి.. అంతేకానీ హ‌ద్దులు దాటి కామెంట్స్ చేయొద్ద‌ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విజ్ఞ‌ప్తి చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్స్ చేస్తున్నారు. అభిమానుల ప్రేమ‌కు మురిసిపోయిన అన్నా మరో పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. 

సరిగా డ్యాన్స్ చేయ‌లేక‌పోయా..
నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన అందరికీ పేరుపేరునా ధ‌న్య‌వాదాలు. ఓప‌క్క‌ టైట్ డ్రెస్, మ‌రోప‌క్క ఎండ వ‌ల్ల సరిగా డ్యాన్స్ చేయ‌లేక‌పోయాను. అలాగే నేనేమీ పెద్ద ప్రొఫెష‌న‌ల్ డ్యాన్స‌ర్‌ని కూడా కాదు. కాక‌పోతే ఇలా స్టెప్పేయ‌డ‌మంటే ఇష్టం. అందుకే నాకు వ‌చ్చినంత‌లో డ్యాన్స్ చేశాను. నెక్స్ట్ టైమ్ మ‌రింత బాగా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాను. ద‌య‌చేసి నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు స‌పోర్ట్ చేయండి అని రాసుకొచ్చింది. 

న‌టి కెరీర్‌..
కాగా అన్నా రాజన్‌ 2017లో 'అంగమలి డైరీస్‌' చిత్రంతో మ‌ల‌యాళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'వేలిపడింతె పుస్తకం' సినిమాలో నటించింది. సూపర్‌ హిట్‌ మూవీ 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' మూవీలో పృథ్వీరాజ్‌ భార్యగా యాక్ట్ చేసింది. ఇటీవ‌ల రండు, తిరిమ‌లై సినిమాలు చేసింది.

 

 

చ‌ద‌వండి: ఓటీటీలో 100 సినిమాలు.. ఎంచ‌క్కా ఇంట్లోనే చూసేయండి

Advertisement
 
Advertisement