
సినీ సెలబ్రెటీలంత సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నటీమణులు, హీరోయిన్లు అయితే తమ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను తరచూ షేర్ చేస్తూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. అంతేగాక అప్పుడప్పుడు లైవ్‌లో అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ఈ క్రమంలో నెటిజన్లు అభ్యంతరకరమైన ప్రశ్నలు వేసి వారికి చిరాకు తెప్పిస్తున్నారు. ఈ క్రమంలో వారి కోపానికి బలైనవారు కూడా ఉన్నారు. తాజాగా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
చదవండి: ‘మా’ ఎన్నికలు: కృష్ణను కలిసిన మోహన్‌బాబు, విష్ణు
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనుపమ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ నుంచి ఎదురైన ప్రశ్నకు ఆమె ఘాటుగా స్పందించింది. సదరు అభిమాని అనుపను బికినీ ధరించిన ఫొటో షేర్ చేయాలని కోరాడు. దీనికి అనుపమ స్పందిస్తూ.. ‘నీ అడ్రస్ పంపు.. ఫొటో పంపిస్తాను. ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో’ అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. అనుపమ ప్రస్తుతం దిల్ రాజు సోదరుడి తనయుడు హీరోగా పరిచయం అవుతున్న రౌడి బాయ్స్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment