ఏ పాత్ర కూడా తనను పూర్తిగా నిర్వచించలేదంటున్న అనుష్క | Anushka Sharma Said About Herself Complete Definition | Sakshi
Sakshi News home page

Anushka Sharma: నేను నటిని, తల్లిని.. అయినా ఏ పాత్ర నన్ను పూర్తిగా నిర్వచించలేదు

Nov 12 2021 4:39 PM | Updated on Nov 12 2021 8:28 PM

Anushka Sharma Said About Herself Complete Definition - Sakshi

బాలీవుడ్‌ నటి, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరి 2021లో అమ్మగా ప్రమోట్‌ అయ్యారు. అప్పటినుంచి ఆమె జీవితంలో ప్రతి క్షణం తన కుమార్తె వామికతో గడిపేలా చూస్తోంది. తల్లిదండ్రులుగా విరాట్‌, అనుష్క సోషల్‌ మీడియాలో తమ చిట్టి పాపాయి గ్లింప్స్‌ను పెడుతున్నారు. ఇటీవల ఒక మ‍్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క తన జీవితంలో రూపాంతరం చెందుతున్న ఆమె గుర్తింపు గురించి చెప్పింది. 

గ్రాజియా ఇండియాతో జరిగిన చాట్‌లో వామికకు తల్లి కాకముందే తను గ్రహించిన అతిపెద్ద విషయం గురించి షేర్‌ చేసుకుంది. 'గత కొన్నేళ్లుగా, నేను తల్లి కాకముందే, జీవితంపై నాకున్న అతిపెద్ద అవగాహన ఏంటంటే.. మీరు మీ ఏ గుర్తింపుతో జతకట్టలేరు, ఎందుకంటే ఇది చాలా చంచలమైనది. నేను నటి, తల్లి అయినప్పటికీ ఏ పాత్ర కూడా నా గుర్తింపును పూర్తిగా మార్చలేదు. నేను ఒక నటిని, తల్లిని. ఈ రెండూ నా జీవితంలో గణనీయమైన సమయాన్ని తీసుకున్నాయి. కానీ ఏ పాత్ర కూడా నన్ను పూర్తిగా నిర్వచించలేదు. ఈ అవగాహన నాకు ఎలా వచ్చిందంటే, నా స్టార్‌డమ్‌ వల్ల వచ్చే నేనేవరో నిర్వచించే ఈ తాత‍్కాలిక స్వభావాన్ని నేను అనుమతించను కాబట్టి.' అని అనుష్క శర్మ తెలిపింది.  

ఇంకా అనుష్క మాట్లాడుతూ, 'ఇండస్ట‍్రీలో ఒకరిలా పని చేస‍్తున్నందున ఆ స్వభావం నుంచి దూరంగా ఉ‍న్నానని అనుకున్నాను. నా దినచర్య రోజు పనికి వెళ్లడం, తిరిగి రావడం, నాతో నేను గడపడం. కానీ నేను ఒక సెలబ్రిటీని, నేను ఒక స్టార్‌, నా దగ‍్గర సక్సెస్‌, ప్రతిభ ఉంద‍న్న ఆధారంగా నా స్వీయ విలువను నేను నిర్వచించుకుంటున్నాను అని నాకు అర్థమైంది. అది నాకు అసాధారణంగా తోచింది. నేను అలాగే అనుకున్నట్లయితే ఏదో ఒక రోజు సమస్యలో చిక్కుకుపోతాను. అప్పుడు వాటినుంచి ఎదుర్కోవడం కష్టమన‍్న విషయాన్ని నేను గుర్తించాను.' 

ప్రస్తుతం అనుష్క, విరాట్‌లు టీ20 ప్రపంచకప్‌లో భాగంగా యూఏఈలో ఉన్నారు. ఈ జంట గత రెండు వారాలుగా యూఏఈలో కలిసి గడుపుతున్నారు. వామిక, ఇతర క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులతో హాలోవీన్ జరుపుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనుష్క తన బ్యానర్‌లో వస్తున్న ప్రొడక్షన్ వెంచర్స్‌తో బిజీగా ఉంది. 'మై అండ్‌ ఖ్వాలా' ఆమె నిర్మిస్తున్న తదుపరి చిత్రం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement