ప్లవనామ సంవత్సరం నుంచి శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా అందరూ వారి జాతకాలు ఎలా ఉన్నాయో అని ఓసారి పంచాంగాన్ని తిరగేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది తమ అభిమాన తారల జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని తహతహలాడుతున్నారు. దీంతో యూట్యూబ్‌లో పలువురు పండితులు ఈ ఏడాది రాజకీయ నాయకులతో పాటు సినీ తారల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో వేణు స్వామి అనే పండితుడు టాలీవుడ్ సెలబ్రిటీలపై చెప్పిన జోస్యం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
వేణుస్వామి మాట్లాడుతూ.. 'నాగచైతన్య, సమంత విడిపోతారని పెళ్లికి ముందే చెప్పాను. అప్పుడు నన్ను నానాబూతులు తిట్టారు. కానీ చివరకు అదే నిజం కావడంతో చాలామంది రియలైజ్ అయ్యారు. పబ్లిక్ డొమైన్‌లో ఉన్నవాళ్ల గురించి నేను మాట్లాడి తీరతాను. ఉదాహరణకు ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలకు సంబంధించి సంచలనాలు నమోదు కాబోతున్నాయి. వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తి సినిమాలు ఆగిపోయే చాన్స్ ఉంది.
టాలీవుడ్‌లో మంచి జాతకమున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది అల్లు అర్జున్ ఒక్కరే. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆయన జాతకంలో ఎటువంటి మార్పులుండవు. ఆయన తీసే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవల్‌లో రూ.200 కోట్ల పైనే బిజినెస్ చేస్తుంది. ఆయనొక బంగారు బాతు. జూనియర్ ఎన్టీఆర్, రానా, మహేశ్‌బాబుల జాతకం కూడా బాగానే ఉంది. అక్కినేని అఖిల్ జాతకంలో నాగదోషం ఉంది. ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా సినిమాలు చేస్తే కచ్చితంగా హిట్ కొడతాడు. సమంత జాతకం బాగుంది. చైతో విడాకుల తర్వాత ఆమెపై పెరిగిన నెగెటివిటీ ఈ సంవత్సరం తగ్గబోతోంది. 2024 వరకు టాలీవుడ్‌లో రష్మిక, సమంత, పూజా హెగ్డేలకు తిరుగులేదు. ఏలినాటి శని ఉన్న పెద్ద దర్శకులకు ఊహించిన విజయాలు రాకపోవచ్చు' అని జోస్యం పలికాడు.
Comments
Please login to add a commentAdd a comment