బాత్‌రూమ్‌ సీన్‌.. ఆ హీరోయిన్‌ చేయనని ఏడ్చేసింది: డైరెక్టర్‌ | Divya Bharathi Refused To Do That Bath Scene In Assembly Rowdy Movie: Director B Gopal - Sakshi
Sakshi News home page

Divya Bharti: అసెంబ్లీ రౌడీ మూవీలో ఆ సీన్‌ చేయనని ఏడ్చిన హీరోయిన్‌.. మోహన్‌బాబు సీరియస్‌.. చివరకు ఆమె తల్లి..

Published Thu, Nov 9 2023 5:57 PM | Last Updated on Thu, Nov 9 2023 6:42 PM

B Gopal: Divya Bharathi Refused to Do that Bath Scene In Assembly Rowdy Movie - Sakshi

చాలామంది దర్శకులు ముందుగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ మొదలుపెట్టినవాళ్లే! ఆ జాబితాలో టాప్‌ డైరెక్టర్‌ బి.గోపాల్‌ ఒకరు. ఈయన పి.సి.రెడ్డి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ఆరంభించారు. తర్వాత కె. రాఘవేంద్రరావు దగ్గర సహాయ దర్శకుడిగా చేరారు. రాఘవేంద్రరావు తెరకెక్కించిన దాదాపు 12 సినిమాలకు బి.గోపాల్‌ పని చేశారు. ఈ సమయంలో దగ్గుబాటి రామానాయుడు ఆయనలో ఉన్న ప్రతిభను గుర్తించి తన బ్యానర్‌లో దర్శకుడిగా ఓ సినిమా తీసే ఛాన్స్‌ ఇచ్చారు.

గ్లామర్‌ హీరోయిన్‌ను తీసుకున్నాం
అలా ప్రతిధ్వని సినిమాతో ఈయన దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించారు. బొబ్బిలి రాజా, లారీ డ్రైవర్‌, అసెంబ్లీ రౌడీ, రౌడీ ఇన్‌స్పెక్టర్‌, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, అల్లరి రాముడు, ఇంద్ర వంటి అనేక సూపర్‌ హిట్‌ సినిమాలను తెలుగు తెరకు అందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. బొబ్బిలి రాజా సినిమాతో గ్లామర్‌ హీరోయిన్‌గా దివ్య భారతికి బాగా పేరొచ్చింది. అలా ఆమెను అసెంబ్లీ రౌడీలోకి తీసుకున్నాం.

ఏడ్చేసిన హీరోయిన్‌
కానీ ఈ మూవీలో ఒకే ఒక గ్లామర్‌ సీన్‌ ఉంటుంది. తీరా ఆ గ్లామర్‌ సన్నివేశం షూటింగ్‌ తీసే రోజు దివ్యభారతి ఇంకా రాలేదు. మోహన్‌బాబు గారు ఏమైంది? ఇంకా ఎంతసేపు ఆలస్యం చేస్తారు? అని కోప్పడుతున్నారు. తను రాకపోవడానికి కారణం ఏంటని ఆరా తీస్తే దివ్య భారతి ఏడుస్తోంది.. షూటింగ్‌కే రానంటోంది.. ఆ డ్రెస్‌ వేసుకోనంటోంది అని చెప్పారు. అమ్మాయేమో రానంటోంది.. షూట్‌ క్యాన్సిల్‌ అంటే మోహన్‌బాబు అరిచేస్తారు.

ఆమె తల్లి నచ్చజెప్పి ఒప్పించింది
ఏం చేయాలా? అని నేనే దివ్య భారతి దగ్గరకు వెళ్లాను. వెళ్లేసరికి నిజంగానే ఏడుస్తోంది. నేను ఈ డ్రెస్‌ వేసుకోను అని చెప్పింది. దీంతో.. ఆ డ్రెస్‌ ఎందుకు వేసుకోవాలి? అనేది వారికి అర్థమయ్యేలా చెప్పాను. అది విని దివ్య భారతి తల్లి.. తన కూతురిని ఒప్పించింది. వెంటనే ఆమె ఐదు నిమిషాల్లో రెడీ అయింది, సీన్‌ కూడా షూట్‌ చేసేశాం. సినిమాలో ఈ సీన్‌ బాగా క్లిక్‌ అయింది' అని దర్శకుడు బి.గోపాల్‌ చెప్పుకొచ్చారు.

చదవండి: ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది.. రతికతో బ్రేకప్‌పై రాహుల్‌ రియాక్షన్‌ ఇదీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement