B.Gopal
-
బాత్రూమ్ సీన్.. ఆ హీరోయిన్ చేయనని ఏడ్చేసింది: డైరెక్టర్
చాలామంది దర్శకులు ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టినవాళ్లే! ఆ జాబితాలో టాప్ డైరెక్టర్ బి.గోపాల్ ఒకరు. ఈయన పి.సి.రెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించారు. తర్వాత కె. రాఘవేంద్రరావు దగ్గర సహాయ దర్శకుడిగా చేరారు. రాఘవేంద్రరావు తెరకెక్కించిన దాదాపు 12 సినిమాలకు బి.గోపాల్ పని చేశారు. ఈ సమయంలో దగ్గుబాటి రామానాయుడు ఆయనలో ఉన్న ప్రతిభను గుర్తించి తన బ్యానర్లో దర్శకుడిగా ఓ సినిమా తీసే ఛాన్స్ ఇచ్చారు. గ్లామర్ హీరోయిన్ను తీసుకున్నాం అలా ప్రతిధ్వని సినిమాతో ఈయన దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించారు. బొబ్బిలి రాజా, లారీ డ్రైవర్, అసెంబ్లీ రౌడీ, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, అల్లరి రాముడు, ఇంద్ర వంటి అనేక సూపర్ హిట్ సినిమాలను తెలుగు తెరకు అందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. బొబ్బిలి రాజా సినిమాతో గ్లామర్ హీరోయిన్గా దివ్య భారతికి బాగా పేరొచ్చింది. అలా ఆమెను అసెంబ్లీ రౌడీలోకి తీసుకున్నాం. ఏడ్చేసిన హీరోయిన్ కానీ ఈ మూవీలో ఒకే ఒక గ్లామర్ సీన్ ఉంటుంది. తీరా ఆ గ్లామర్ సన్నివేశం షూటింగ్ తీసే రోజు దివ్యభారతి ఇంకా రాలేదు. మోహన్‌బాబు గారు ఏమైంది? ఇంకా ఎంతసేపు ఆలస్యం చేస్తారు? అని కోప్పడుతున్నారు. తను రాకపోవడానికి కారణం ఏంటని ఆరా తీస్తే దివ్య భారతి ఏడుస్తోంది.. షూటింగ్‌కే రానంటోంది.. ఆ డ్రెస్ వేసుకోనంటోంది అని చెప్పారు. అమ్మాయేమో రానంటోంది.. షూట్ క్యాన్సిల్ అంటే మోహన్‌బాబు అరిచేస్తారు. ఆమె తల్లి నచ్చజెప్పి ఒప్పించింది ఏం చేయాలా? అని నేనే దివ్య భారతి దగ్గరకు వెళ్లాను. వెళ్లేసరికి నిజంగానే ఏడుస్తోంది. నేను ఈ డ్రెస్ వేసుకోను అని చెప్పింది. దీంతో.. ఆ డ్రెస్ ఎందుకు వేసుకోవాలి? అనేది వారికి అర్థమయ్యేలా చెప్పాను. అది విని దివ్య భారతి తల్లి.. తన కూతురిని ఒప్పించింది. వెంటనే ఆమె ఐదు నిమిషాల్లో రెడీ అయింది, సీన్ కూడా షూట్ చేసేశాం. సినిమాలో ఈ సీన్ బాగా క్లిక్ అయింది' అని దర్శకుడు బి.గోపాల్ చెప్పుకొచ్చారు. చదవండి: ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది.. రతికతో బ్రేకప్‌పై రాహుల్ రియాక్షన్ ఇదీ! -
నటుడిగా నాకు ఇది పునర్జన్మ: హీరో
Sriram Speech About Tenth Class Diaries In Pre Release Event: ‘‘టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమాలో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ మూవీ పెద్ద హిట్టవుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో నిఖిల్ పేర్కొన్నారు. శ్రీరామ్, అవికా గోర్ జంటగా ‘గరుడవేగ’ అంజి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అజయ్ మైసూర్ సమర్పణలో అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదలవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ– ‘‘సహాయ దర్శకుడు కావాలనుకున్న నేను ముందు కెమెరా విభాగంలో చేశాను. సినిమాటోగ్రాఫర్ అంజి ఈ సినిమాతో దర్శకుడు కావడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. ‘‘టెన్త్ క్లాస్ డైరీస్’లో ఎమోషన్‌తో పాటు కామెడీ కూడా ఉంది’’ అన్నారు అచ్యుత రామారావు. ‘‘కథలో మార్పులు చేశాక బడ్జెట్ డబుల్ అయింది. అయినా నిర్మాతలు రాజీ పడలేదు’’ ‘గరుడవేగ’ అంజి పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా చూశాక పదో తరగతి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు’’ అని రవితేజ మన్యం చెప్పుకొచ్చారు. ‘‘ఒకరికి ఒకరు’ తర్వాత నేను చేసిన మంచి చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. నటుడిగా ఇది నాకు పునర్జన్మ అనాలి’’ అని హీరో శ్రీరామ్ తెలిపారు. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. 'ఐ లవ్ యూ సాన్' అంటూ సూసైడ్ నోట్ స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! -
అందుకే ఎక్కువ సినిమాలు చేయలేకపోయా: డైరెక్టర్
‘‘దర్శకుడికి రాయడం కూడా తెలిసి ఉండాలి. డైరెక్టర్.. రచయిత కాకపోవడం ఓ రకంగా లోపమే అని నాకు అనిపిస్తుంది. నాకు దర్శకత్వంలో ఉన్న ప్రావీణ్యత, కథలు రాయడంలో కూడా ఉన్నట్లయితే నా నుంచి ఇంకా ఎక్కువ సినిమాలు వచ్చి ఉండేవి’’ అన్నారు దర్శకుడు బి.గోపాల్. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘ఇంద్ర’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన బి. గోపాల్ తెరకెక్కించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. గోపీచంద్, నయనతార జంటగా తాండ్ర రమేశ్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బి. గోపాల్ చెప్పిన విశేషాలు. తండ్రీకొడుకల కథే ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రం. ఓ తండ్రికి ఇద్దరు కొడుకులు. అందులో ఒక కొడుకు బాధ్యత లేకుండా ఉంటాడు. దీంతో తండ్రి అతన్ని ఇంటి నుంచి బయటకు పంపేస్తాడు. కానీ కొందరు రౌడీల వల్ల తండ్రి ఇబ్బందిపడుతున్న విషయాన్ని తల్లి ద్వారా తెలుసుకున్న కొడుకు ఆ రౌడీల నుంచి తన కుంటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అన్నదే కథ. తండ్రి పాత్రలో ప్రకాశ్‌రాజ్, కొడుకు పాత్రలో గోపీచంద్ నటించారు. ఇందులో ఎమోషన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. మణిశర్మ సంగీతం, వక్కంతం వంశీ కథ, అబ్బూరి రవి మాటలు హైలైట్స్. గోపీచంద్ అద్భుతంగా నటించారు. దాదాపు పన్నెండేళ్లు దర్శకత్వ శాఖలో (అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్)గా చేసిన నేను 1985లో డైరెక్టర్ అయ్యాను. అయితే ఇప్పటవరకు 33 సినిమాలే చేయగలిగాను. నిజానికి ఈపాటికి వంద సినిమాలు చేయాల్సింది. కానీ స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తాను. హిట్టూ, ఫ్లాప్‌కు మధ్య ఉన్న తేడా స్క్రిప్టే. కానీ స్క్రిప్ట్ రాసుకోవడం నాకు చేతకాదు. బాలకృష్ణగారితో ఆరంభించిన ‘హరహర మహాదేవ’ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మంచి కథ కుదిరితే ఆయనతో ‘నరసింహనాయుడు’, ‘సమరసింహారెడ్డి’లను మించిన హిట్ తీయాలని ఉంది. నాకు సూపర్‌హిట్స్ ఇచ్చిన రైటర్సే కథలు చెబుతున్నారు కానీ ఫుల్ సబ్జెక్ట్‌గా కుదరడం లేదు. రైటర్స్ చిన్నికృష్ణ, సాయిమాధవ్ బుర్రా కూడా కథలు చెప్పారు. అందుకే ఎక్కువ సినిమాలు చేయలేకపోయా! -
Aaradugula Bullet: ‘గోపీచంద్‌కు సరైన స్క్రిప్ట్ ఇది’
ఆకతాయి కొడుకు, స్ట్రిక్ట్ తండ్రి అనే కాన్సెప్ట్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ‘ఆరడుగుల బుల్లెట్’లో ఎమోషన్స్ బాగుంటాయి. ఫాదర్ అండ్ సన్ రిలేషన్, నయనతారతో లవ్ స్టోరీ, విలన్స్‌తో క్లాష్ హై ఓల్టేజ్‌గా ఉంటుంది. గోపీచంద్‌కు సరైన స్క్రిప్ట్ ఇది’అన్నారు దర్శకుడు బి.గోపాల్. మ్యాచో స్టార్ గోపీచంద్ - నయనతార హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ మీద తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 8న ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బీ గోపాల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఆరడుగుల బుల్లెట్ ఓ కమర్షియల్ సినిమా. తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ. ఆకతాయి కొడుకుని తండ్రి దూరంగా పెట్టడం, ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆ కొడుకే వచ్చి కాపాడతాడు. ఆ తండ్రి కొడుకును ఎంతలా అపార్ఠం చేసుకున్నాడు.. ఎంతలా మిస్ అయ్యాడు.. ఆ ఫ్యామిలీని అతను ఎలా కాపాడాడు అనేదే కథ. ►ఆకతాయి కొడుకు, స్ట్రిక్ట్ తండ్రి అనే కాన్సెప్ట్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి. వక్కంతం వంశీ కథ, అబ్బూరి రవి మాటలు బాగున్నాయి. ► వక్కంతం వంశీ అందించిన కథ నిర్మాతలకు, గోపీచంద్ అందరికీ నచ్చడంతోనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టాం. ► 1985లో దర్శకుడిని అయ్యాను. కానీ నేను చేసింది 35 సినిమాలే. మామూలుగా అయితే వందల సినిమాలు చేయోచ్చు. కానీ నాకు కథ, స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తాను. అందరికీ నచ్చేలా ఉంటేనే సినిమాను చేస్తాను. ► నేను చేసినవి ఏవీ కూడా నా కథలు కాదు. సీనియర్ రచయితలు,కొత్త రచయితలను అందరినీ అడుగుతుంటాను. మస్కా సినిమాతో కొత్త రచయితను పరిచయం చేశాను. చిన్ని కృష్ణను కూడా నేనే పరిచయం చేశాను. నాకు కథ నచ్చితేనే సినిమాకు న్యాయం చేయగలుగుతాను. ► స్క్రిప్ట్ బాగుంటే.. సూపర్ హిట్ అవుతాయి. లేదంటే ఫ్లాప్ అవుతాయి. క్రాక్ జనాలకు నచ్చింది. కాబట్టే సూపర్ హిట్ అయింది. చివరకు జనాలకు నచ్చితేనే ఆడుతాయి. సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఇంద్ర బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. ► ఓటీటీ కంటెంట్లను కూడా జనాలు బాగానే చూస్తున్నారు. కానీ నాకు మాత్రం థియేటర్లోనే సినిమా చూడటం ఇష్టం. పెద్ద తెరపై సినిమా చూసేందుకే జనాలు ఇష్టపడతారు. ► ఫ్యాక్షన్ కథ చేస్తున్నామని సినిమా చేస్తున్నంత వరకు నాకు తెలీదు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, ఇంద్ర సమయంలోనూ ఫ్యాక్షన్ సినిమా చేస్తున్నాను అని అనుకోలేదు. ఇప్పుడు కూడా ఎవరైనా కథ చెబితే.. ఫ్యాక్షన్ డ్రాప్లో డైరెక్షన్ చేసేందుకు రెడీగా ఉన్నాను. బాలయ్య బాబుతో సినిమా చేయాలని చాలా ట్రై చేశాను. కానీ స్క్రిప్ట్ సరిగ్గా రాకపోవడంతో ఆలస్యమవుతూ వచ్చింది. బాలయ్య బాబుతో సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి కంటే బ్లాక్ బస్టర్ హిట్ తీయాలనే కోరిక ఉంది. ► నేను సాఫ్ట్‌గా ఉంటాను. మైకుల ముందు కూడా మాట్లాడటం రాదు. కానీ సినిమాల్లో మాత్రం హింస ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం నా స్క్రిప్ట్ రైటర్స్. స్క్రిప్ట్‌ను బట్టి, నా హీరోలను బట్టి ఓ డైనమిక్ షాట్‌ను పెట్టాలనిపిస్తుంది. అందుకే అలాంటి సీన్స్ పడ్డాయి. ► సినిమా అంటే పాటలు, ఫైట్లు పెడతాను. కానీ సిట్యువేషన్‌ను బట్టి ఫైట్లు పెడతాను. నరసింహానాయుడు ట్రైన్ సీక్వెన్స్‌లో బాలయ్య బాబుకు గొడ్డలి తగులుతుంది. ఆ సీన్‌కు అందరూ ప్రశంసలు కురిపించారు. కమర్షియల్ సినిమాలను ఆడియెన్స్‌కు నచ్చేట్టుగా తీయాలని ప్రయత్నిస్తాను. -
ఓటీటీలో గోపీచంద్-నయన్ చిత్రం?
మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగాన్ని కూడా కుదిపేసింది. చాలా విరామం తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలవుతున్నాయి. అయితే థియేటర్లు తెరుచుకునే విషయంలో ఇప్పటికీ సందిగ్దత కొనసాగుతూనే ఉంది. దీంతో విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రాలను ఓటీటీ (ఓవర్ ది టాప్ మీడియా సర్వీసెస్)లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా విడుదల అయ్యాయి. అమృతరామమ్‌తో పాటు కీర్తి సురేష్, జ్యోతిక, అమితాబ్‌ల చిత్రాలు ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక షూటింగ్ పూర్తి చేసుకొని పలు కారణాలతో విడుదలకు నోచుకోని చిత్రాలు సైతం ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. (ఆగస్ట్‌లో కబడ్డీ కబడ్డీ) తాజాగా గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రం కూడా డిజిటల్ బాట పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడేళ్ల క్రితం గోపీచంద్, నయనతార జంటగా మాస్ డైరెక్టర్ బి. గోపాల్ తెరకెక్కించిన సినిమా 'ఆరడుగుల బుల్లెట్'. షూటింగ్ పూర్తయినా.. చిత్ర విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాత ప్రయత్నాలు మొదలు పెట్టారంటా. గోపిచంద్ క్రేజ్, నయనతరా గ్లామర్, గోపాల్ ఇమేజ్ కలగలపి ఈ చిత్రానికి ఓటీటీలో మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఓటీటీ నిర్వాహకులతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే గుడ్ న్యూస్ రానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఓటీటీలో విడుదల అవుతున్న గోపీచంద్-నయనతార చిత్రం ఎలా వుంటుందో చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. (ఐ వాన్న అన్‌ఫాలో యు) -
‘సమరసింహారెడ్డి’ మళ్లీ రిపీట్ అవుతుందా?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారణాసిలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు డిఫరెంట్ పాత్రలు కనిపిస్తాడని టాక్. ఇక లాక్డౌన్ సమయంలో బోయపాటి తర్వాత చేయబోయే చిత్రంపై ఈ నందమూరి హీరో ఫోకస్ చేశారు. అయిత టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం బాలయ్య తన 107వ చిత్రాన్ని బి.గోపాల దర్శకత్వంలో చేయనున్నాడట. ఇప్పటికే పలు కథలు విన్న బాలయ్య దర్శకుడు బి.గోపాల్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చిందని, పూర్తి స్క్రిప్ట్‌ను కూడా గోపాల్ సిద్దం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా రచయిత సాయిమాధవ్ బుర్రా స్క్రిప్ట్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త పాత్రలో కనిపించనున్నారని, ఓ యువతికి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారట. ఇక బోయపాటి చిత్రం పూర్తయిన వెంటనే బి.గోపాల్ సినిమా మొదలుపెట్టనున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక బాలయ్య-గోపాల్ కాంబినేషన్లో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా అన్నీ కుదిరి వీరి కలయికలో మరో చిత్రం వస్తే బాగుంటుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చదవండి: అదిరేటి లుక్‌లో మహేశ్.. సినిమా కోసమేనా? పదే పదే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి బాలయ్య కోసం భారీగా శత్రు గణం -
ఇలాంటి కథే చేయాలనుకున్నా!
‘‘ఇండస్ట్రీకి వచ్చినప్పట్నుంచీ గోపాల్‌గారితో సినిమా చేయాలని నా కోరిక. నిర్మాత బుజ్జి (నల్లమలుపు శ్రీనివాస్) కాంబినేషన్లో ఓసారి అనుకున్నా... సినిమా కుదరలేదు. వంశీ (వక్కంతం) కథ చెబుతాడు.. వినమని గోపాల్గారు ఫోన్ చేశారు. కథ విన్న తర్వాత ఆయనతో చేస్తే... ఇలాంటి కథే చేయాలనుకున్నా’’ అన్నారు గోపీచంద్. ఆయన హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో తాండ్ర రమేశ్ నిర్మించిన ‘ఆరడుగుల బుల్లెట్’ వచ్చే నెల 9న విడుదల కానుంది. గోపీచంద్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారు, బాలకృష్ణగారు వంటి పెద్ద హీరోలతో చేసిన గోపాల్‌గారితో వర్క్ ఎలా ఉంటుందో? అనుకున్నా. కానీ, కూల్‌గా షూటింగ్ జరిగింది. నయనతార లవ్లీ క్యారెక్టర్లో నటించారు. మణిశర్మగారు మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు. సినిమా ఈ స్థాయికి రావడానికి కారణమైన పీవీపీగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నా చిత్రాల్లో ఉండే మాస్, కామెడీలతో పాటు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు బి. గోపాల్. ‘‘కుటుంబమే ఆస్థి అని నమ్మే హీరో కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడనేది చిత్రకథ’’ అన్నారు అబ్బూరి రవి. నిర్మాత తాండ్ర రమేశ్ పాల్గొన్నారు. -
ఐమాక్స్ ప్రీమియార్ షో లో రౌడీ టీమ్ సందడి
-
తమిళంలో గోపీచంద్ ఎంట్రీ
అనువాద చిత్రాల రూపంలోనో, ఏకకాలంలో తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూనో తమిళ హీరోలు టాలీవుడ్లో మార్కెట్ పెంచుకుంటున్నారు. అలాగే తమిళ దర్శకులు ఇక్కడి చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు, దర్శకులు కూడా తమిళ పరిశ్రమలో తమ సత్తా చాటుకునే సమయం ఆసన్నమైంది. ఆల్రెడీ కొంతమంది హీరోలు తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడా జాబితాలో గోపీచంద్ కూడా చేరారు. ఆయన తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి బి.గోపాల్ దర్శకుడు. ఈ చిత్రం శుక్రవారం చెన్నయ్‌లో ప్రారంభమైంది. ‘జయం’ తమిళ రీమేక్‌లో విలన్‌గా నటించిన గోపీచంద్, ఆ తర్వాత పలు అనువాద చిత్రాల ద్వారా తమిళ తెరపై కనిపించారు. హీరోగా ఆయన చేస్తున్న స్ట్రయిట్ తమిళ చిత్రం ఇదే. ఇక, బి.గోపాల్ విషయానికొస్తే.. ఆయన దర్శకత్వం వహించిన లారీడ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు తదితర చిత్రాలు తమిళంలోకి అనువాదమయ్యాయి. ఇప్పుడీ స్ట్రయిట్ చిత్రంతో తమిళ ప్రేక్షకులను అలరించబోతున్నారాయన. ఇందులో గోపీచంద్ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. జయబాలాజీ రియల్ మీడియా పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరకర్త. సెప్టెంబర్ 1న స్విట్జర్లాండ్‌లో తొలి షెడ్యూల్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు. కొసమెరుపు ఏంటంటే.. తమిళ వెర్షన్లో గోపీచంద్ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోబోతున్నారు.