నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారణాసిలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు డిఫరెంట్ పాత్రలు కనిపిస్తాడని టాక్. ఇక లాక్‌డౌన్ సమయంలో బోయపాటి తర్వాత చేయబోయే చిత్రంపై ఈ నందమూరి హీరో ఫోకస్ చేశారు. అయిత టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం బాలయ్య తన 107వ చిత్రాన్ని బి.గోపాల దర్శకత్వంలో చేయనున్నాడట.
ఇప్పటికే పలు కథలు విన్న బాలయ్య దర్శకుడు బి.గోపాల్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చిందని, పూర్తి స్క్రిప్ట్‌ను కూడా గోపాల్ సిద్దం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా రచయిత సాయిమాధవ్ బుర్రా స్క్రిప్ట్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త పాత్రలో కనిపించనున్నారని, ఓ యువతికి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారట. ఇక బోయపాటి చిత్రం పూర్తయిన వెంటనే బి.గోపాల్ సినిమా మొదలుపెట్టనున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక బాలయ్య-గోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా అన్నీ కుదిరి వీరి కలయికలో మరో చిత్రం వస్తే బాగుంటుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
చదవండి:
అదిరేటి లుక్‌లో మహేశ్.. సినిమా కోసమేనా?
పదే పదే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి
బాలయ్య కోసం భారీగా శత్రు గణం
Comments
Please login to add a commentAdd a comment