బిగ్‌బాస్ నాల్గవ సీజన్ లాంచింగ్ ఎపిసోడ్ అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది. ఆర్భాటంగా ప్రారంభమైన ఈ షో ఇప్పుడిప్పుడే ఆసక్తికరంగా మారుతోంది. హౌస్‌లో కన్ఫెషన్ రూమ్‌లోకి తొలిసారి అడుగు పెట్టిన లాస్యే మొదటి కెప్టెన్‌గా నిలిచింది. తర్వాత నోయల్ ఈ వారం వెళ్లిపోతానంటూనే రెండో కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. అంతో ఇంతో పాపులారిటీతో హౌస్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీరిద్దరు మాత్రమే. దీంతో బిగ్‌బాస్ యాజమాన్యం కూడా వీరికి బాగానే ముట్టజెప్పింది. ఇదిలా వుంటే రెండో వారంలో కమెడియన్ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతడిని హౌస్‌లోకి రప్పించేందుకు బిగ్‌బాస్ యాజమాన్యం బాగానే డబ్బులు గుమ్మరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. (బిగ్‌బాస్: వారం రోజులకు లక్షల్లో ఇచ్చారు)
లాస్య కన్నా రెట్టింపు పారితోషికం
మరోవైపు అవినాష్ కూడా ఈ షో కోసం తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ అగ్రిమెంట్‌ను పక్కనపెట్టినట్లు సమాచారం. దీంతో జబర్దస్త్ నిర్వాహకులు అతడి దగ్గర నుంచి నష్టపరిహారంగా రూ.10 లక్షలు వసూలు చేశారట. ఈ విషయం తెలిసిన బిగ్‌బాస్ టీం.. హౌస్‌లో ఎక్కువ పారితోషికం అందుకుంటున్న లాస్య కన్నా అవినాష్‌కు రెట్టింపు డబ్బులు ఇస్తున్నారని తెలిసింది. కాగా లాస్యకు ఇప్పటికే రోజుకు సుమారు లక్ష రూపాయలు ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ లెక్కన అవినాష్‌కు రెట్టింపు పారితోషకం ఇస్తున్నారంటే అతను జబర్దస్త్‌కు చెల్లించిన నష్టపరిహారాన్ని ఒక్క వారంలో వసూలు చేస్తాడన్నమాట. ఇదిలా వుంటే అవినాష్ మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కుమార్ సాయిలా ఏకాకిగా మిగిలిపోకుండా అందరితో బాగానే కలిసిపోయాడు. అతడు టాప్ 5లో ఉంటాడా? లేదా అనేది ఇప్పుడే చెప్పలేం కానీ, ఓ పది వారాలపాటైనా హౌస్‌లో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. (బిగ్‌బాస్‌లో నా వాయిస్, సంతోషంగా ఉంది: నందు)
Comments
Please login to add a commentAdd a comment