బిగ్‌బాస్‌ : తొలిసారి అవినాష్‌.. సోహైల్‌ రిక్వెస్ట్‌ | Bigg Boss 4 Telugu: Seventh Week Nomination Process | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : అరియానాపై హౌస్‌మేట్స్‌ ప్రశంసలు

Published Mon, Oct 19 2020 11:07 PM | Last Updated on Tue, Oct 20 2020 2:39 PM

Bigg Boss 4 Telugu: Seventh Week Nomination Process - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 చూస్తుండగానే ఆరు వారాలు ముగించుకొని ఏడో వారంలోకి అడుగుపెట్టింది. ప్రతీవారం మాదిరే ఈ వారం కూడా నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అయితే ప్రతీసారి చేసుకున్నట్లు ఆరోపణలు, తిట్లు  ఈ వారం లేవు. కొంతమంది త్యాగాలు చేసి మరీ తమ ఫ్రేండ్స్‌ని సేవ్‌ చేశారు. అరియానా నామినేట్‌ అవుతూనే హౌస్‌మేట్స్‌ మనసులను గెలిచింది. ఇక ఏడోవారం నామినేషన్స్‌ ప్రక్రియలో ఎవరెవరిపై రంగుపడిందో, బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఏమేం జరిగిందో చూసేద్దాం.

హారికపై అవినాష్‌ పంచ్‌లు
అవినాషన్‌ కాస్త మూడీగా కనిపించడంతో ఏమైంది అవినాష్‌ అంటూ అరియానా పలకరించింది. అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండాలంటూ సలహాలు ఇచ్చింది. ఇక హారీక పొడవాటి టీషర్ట్‌ ధరించి రావడంతో అవినాష్‌,అఖిల్‌, సోహైల్‌ ఆమెతో ఓ ఆట ఆడుకున్నారు. అవినాష్‌ అయితే తనదైన శైలీలో పంచ్‌లేస్తూ హారికను ఏడిపించారు. లూజు అని ఏడిపిస్తున్నారంటూ హారిక బిగ్‌బాస్‌కు చెప్పుకుంది. నామినేషన్‌ ప్రక్రియలో మీ పని చెబుతా అని సరదాగా హెచ్చరించింది. 

మోనాల్‌ కోసం అరియానా రాయబారం
మోనాల్‌, అభిజిత్‌ మాట్లాడుకోకపోవడంతో ఎలాగైనా వారిద్దరిని కలపాలని అరియానా డిసైడ్‌ అయింది. ఈ విషయం నోయల్‌తో చెప్పి అభిజిత్‌ దగ్గరకు వెళ్లింది. ‘నిజంగా చెప్పాలంటే క్షమించు’ అని పాటపాడుతూ.. అభి నీతో ఒకవిషయం చర్చించాలని కోరింది. ఏంటా విషయం అని అభిజిత్‌ అడగ్గా.. అయిందేదో అయిపోయింది మోనాల్‌తో మాట్లాడు అని రిక్వెస్ట్‌ చేసింది. అయితే అరియానా రిక్వెస్ట్‌ను అభిజిత్‌ సున్నితంగా తిరస్కరించాడు. తనతో మాట్లాడే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టాడు.  ఇక ఈ విషయంపై నోయల్, లాస్య, హారికలతో కలిపి పెద్ద చర్చ పెట్టాడు అభిజిత్. మోనాల్‌తో మాట్లాడటం తనకు ఇష్టం లేదని, అయినా అరియానాకు ఎందుకంత.. అంటూ అసభ్య పదం వాడి నోరు జారాడు అభిజిత్. ఆ మాట అనగానే హారిక-లాస్య నవ్వారు. 

ఫిటింగ్‌ ‌ పెట్టిన బిగ్‌బాస్‌
బిగ్‌బాస్‌ అంటేనే వివాదాలు, కాంట్రవర్సీలు, ఒకరినొకరు అరుచుకోవడం. ఎంత ప్రేమగా ఉండాలని ట్రై చేసిన కంటెస్టెంట్స్‌ మధ్య చిచ్చు పెట్టడమే బిగ్‌బాస్‌ పని. అయితే ఈ చిచ్చులకు పునాది వేదేది మాత్రం ప్రతి సోమవారమే. ఆ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌ ప్రక్రియ ఉంటుంది. దీంతో ఆ రోజంతా హౌస్‌మేట్స్‌ మధ్య గొడవలు, ఏడుపులు, అలగడాలు ఉంటాయి. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎలిమినేషన్‌ ప్రక్రియలో హౌస్‌మేట్స్‌ మధ్య చిచ్చు పెట్టాడు బిగ్‌బాస్‌. ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా హౌస్‌మేట్స్‌ని జతలుగా విడదీసి, ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారో చెప్పి వారిపై రంగు నీళ్లు పోయాల్సిందిగా బిగ్‌బాస్‌ ఆదేశించారు.

అఖిల్‌ కోసం మోనాల్‌ త్యాగం
నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా అఖిల్‌, మోనాల్‌ తాము ఎందుకు హౌస్‌లో ఉండాలనుకుంటున్నారో వివరించారు. అఖిల్‌ చాలా స్ట్రాంగ్‌ అని అందుకే నేను సేవ్‌ అవుతానని మోనాల్‌ చెప్పగా.. నేను టాస్క్‌లు బాగా ఆడుతున్నానని, ఓడిపోయినా కూడా నా వంతు కృషి చేస్తున్నానని, నాకంటే నువ్వు తక్కువగా ఆడుతున్నావని మోనాల్‌కి చెప్పాడు. దానికి అంగీకరించిన మోనాల్‌..నామినేట్‌ అవ్వడానికి సిద్దపడింది. 

తొలిసారి అవినాష్‌ నామినేట్‌
సోహైల్‌-అవినాష్‌లలో ఇద్దరూ నామినేట్‌ కావడానికి సిద్దపడలేదు. అవినాష్‌ ఇంతవరకు ఒక్కసారి కూడా నామినేట్‌ కాలేదని, ఈ సారి నామినేషన్‌కి వెళ్లాలని సోహైల్‌ కోరారు. అయితే అవినాష్‌ మాత్రం ససేమిరా అన్నాడు. తన ప్రవర్తన వల్లే ఇంతవరకు నామినేట్‌ కాలేదని చెప్పుకొచ్చాడు. ఇక గతంలో సంచాలకుడి వ్యవహరించిన సోహైల్‌పై అరిచాడనే కారణంతో ఎలిమినేట్‌ కావాలని కోరాగా..దానికి కూడా అవినాష్‌ ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరు బిగ్‌బాస్‌ ఒపీనియన్‌ తీసుకున్నారు. అయితే బిగ్‌బాస్‌ మాత్రం అది వారిద్దరికే వదిలిపెట్టాడు. దీంతో చివరకి అనినాష్‌ అసంతృప్తిగానే నామినేట్‌ అవ్వడానికి ఒప్పకున్నాడు. ‘బిగ్ బాస్ చిన్న చిన్న కారణాలకు నామినేట్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. మేం ఎలాంటి పరిస్థితితుల్లో ఇక్కడికి వచ్చామో మీకు తెలుసు. కొన్ని వదులుకుని మేం ఇక్కడికి వచ్చాం.. బయటకు వెళ్తే మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. వ్యక్తిగత కారణాలతో నామినేట్ చేసుకోవాలని అంటున్నారు.. జరిగిపోయిన వాటిని మళ్లీ కారణాలుగా చెప్పి నామినేట్ చేసుకోమనడం కరెక్ట్ కాదు.. సేఫ్ గేమ్ ఆడుతున్నా అన్నారు.. అరిస్తే రీజన్ తీసుకుని నామినేషన్ కావాలంటున్నారు.. ఏమౌతుందో తెలియడం లేదు’ అంటూ అసంతృప్తిగా నామినేట్‌ అయ్యాడు. ఇక అవినాష్‌ త్యాగానికి మురిసిపోయిన సోహైల్‌.. ఆయనను కాపాడాలని ప్రేక్షకులకు విన్నవించాడు. 


అభి త్యాగం.. హారిక కంటతడి
అభిజిత్-హారికల మధ్య కూడా ఇలాగే డిస్కషన్ జరిగింది. అయితే అందరి జంటల్లో నువ్వంటే..నువ్వు ఎలిమినేట్‌ కావాలి అని గొడవ జరగ్గా.. అభి-హారిక జంటలో మాత్రం వెరైటీ త్యాగాల కోసం గొడవపడ్డారు.  మొత్తం ఆరునామినేషన్స్‌లో ఐదు నామినేషన్స్‌లో ఉన్నా.. ప్రతిసారీ సేవ్ చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా నామినేట్ అయితే సేవ్ చేస్తారని అనుకోలేను.. సో నువ్ నామినేట్ అయితే బాగుంటుంది అని హారికతో చెప్పాడు అభిజిత్. నాకంటే నువ్ ఒక నామినేషన్‌లో ఎక్కువ ఉన్నావ్ అంతే.. త్యాగాలు, కాంప్రమైజ్ అయ్యే వీక్ కాదు ఇది. నేను నామినేట్ అవుతాం అని చెప్పలేదు.. ఇద్దరిలో ఎవరం ఎక్కువ కాదు.. తక్కువ కాదు’ అని చెప్పింది హారిక.పెర్ఫామెన్స్ పరంగా నేను రోబో టాస్క్‌లో మాత్రమే సరిగా చేయగలిగా.. ఆ తరువాత ఏం చేయలేదు.. నాకు చాన్స్ ఉంటే నెక్స్ట్ వీక్ చేయొచ్చు కదా’ అని చెప్పాడు అభిజిత్.దీంతో హారిక ఇది అన్ ఫెయిర్ బిగ్ బాస్.. అభిజిత్ నిన్ను బ్లేమ్ చేయడం లేదు.. బిగ్ బాస్‌ని బ్లేమ్ చేస్తున్నా.. ఇద్దరిలో ఎవరు నామినేట్ అయినా అన్ ఫెయిర్.. నేను సేవ్ అయినా హ్యాపీగా ఉండలేను.. నీకు నేను నామినేట్ కావడం ఇష్టం లేదు.. నాకు నువ్ నామినేట్ కావడం ఇష్టం లేదు.. నా నోటితో నేను నామినేషన్‌కి నీ పేరు చెప్పలేను అభి.. అంటూ హారిక తెగ ఫీల్ అయిపోవడంతో అభిజిత్ వెనక్కి తగ్గి తనని తాను నామినేట్ చేసుకున్నాడు. దీంతో హారిక ఏడుస్తూ అభిపై రంగనీళ్ల బకెట్‌ను వదిలింది.

ఓపినియన్‌ మారాలంటూ దివి నామినేట్‌
 తాను నాలుగుసార్లు ఎలిమినేట్‌ అయ్యానని, ఈ సారి నువ్వు కావాలంటూ దివికి చెప్పింది లాస్య. ఈ సారి నాకు ఓట్లు వేస్తున్న ప్రేక్షకులకు కాస్త రెస్ట్‌ ఇద్దామనుకుంటున్నానని చెప్పింది. ఇక దివి మాత్రం నేనంటే నీకు పడటంలేదని, ఇప్పటి నుంచైనా నాపై ఉన్న బ్యాడ్‌ ఒపీనియన్‌ మార్చుకోవాలని ఆశిస్తూ నామినేషన్‌కి వెళ్తున్నా అని చెప్పింది.

అరియానాపై హౌస్‌మేట్స్‌ ప్రశంసలు
 అరియానా -మెహ‌బూబ్‌ల మ‌ధ్య అత్యంత ఆసక్తికరమైన చర్చ జ‌రిగింది. త‌నకు నామినేట్ కావ‌డం ఇష్టం లేద‌ని అరియానా .. త‌న‌కూ ఇష్టం లేద‌ని మెహ‌బూబ్ పోటా పోటీగా వాదించుకున్నారు. ఫైన‌ల్‌గా అరియానా నామినేట్ చేసుకుంది. ఆట‌లో త‌ను నామినేట్ అయినా రియ‌ల్‌గా గెలిచింది. ఈ విష‌యంలో అ‌రియానా ముందు మెహ‌బూబ్ గెలిచినా ఓడిపోయాడు. ఇక అరియానా త్యాగానికి హౌస్‌మేట్స్‌ ఫిదా అయ్యారు. మోహబూబ్‌ త్యాగం చేస్తే తన రేంజ్‌ ఓ లెవల్లో పెరిగిపోయేదని అంతా గుసగుస పెట్టారు. సోహైల్‌ అయితే అరియానా మీద మరింత రెస్పెక్ట్‌ పెరిగిందన్నారు. ఇలా సోమ‌వారం ఎపిసోడ్ మొత్తం నామినేష‌న్ ప్ర‌క్రియ‌పైనే సాగింది. మొత్తానికి ఈ వారం మోనాల్‌, అవినాష్‌, అభిజిత్‌, దివి, అరియానా, నోయల్‌ ఎలిమినేషన్‌లో ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement