Bigg Boss 4 Telugu: Contestants Names List with Photos | Contestants Wiki, Bio, Profiles - Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ : బుల్లితెర హంగామా మొదలైంది

Published Sun, Sep 6 2020 6:04 PM | Last Updated on Mon, Sep 7 2020 3:25 PM

Bigg Boss 4 Telugu Started And Nagarajuna As Host  - Sakshi

తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. కింగ్ నాగార్జున వరసగా రెండో సారి వ్యాఖ్యాతగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులు ఇచ్చేందుకు సిద్ధమైంది. కరోనా కాలంలో వస్తాడో రాడో అనుకున్న సమయంలో ‘మాస్కు కావాల్సింది ముఖానికి కానీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు కాదు’ అంటూ స్మాల్‌ స్క్రీన్‌పైకి వచ్చేశాడు బిగ్‌బాస్‌. స్టార్‌ మాలో సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షోలో తారాజువ్వల వెలుగులో గ్రాండీయర్‌గా ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్‌ నాగార్జున. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన సినిమాలలోని పాటలకే సందడిగా డ్యాన్సులు చేశాడు. ఈసారి వేదికపై నాగ్ డ్యూయల్ రోల్ చేశారు. వృద్ధుడైన తండ్రిగా, కుమారుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ వినోదం అందించే ప్రయత్నం చేశారు. వృద్ధ నాగార్జున బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించి ఒక్కో ప్రదేశాన్ని ఆడియన్స్ కు పరిచేయం చేశారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో ఎప్పుడూ లేనంత రిచ్ గా కనిపిస్తోంది.  డైనింగ్ టేబుల్, హాల్, బెడ్ రూములు, స్విమ్మింగ్ పూల్... ఇలా ప్రతి అంశం కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఇక ఈ సారి హౌజ్‌లోకి 16మంది వస్తున్నారని తాతగారు చెప్పకనే చెప్పారు. నాగార్జున నాన్నగారికి బిగ్‌బాస్‌ ధన్యవాదాలు తెలిపాడు. 


మోనాల్‌ గజ్జర్‌

ఇక బిగ్‌బాస్‌-4 మొదటి కంటెస్టెంట్‌గా హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌ను నాగార్జున పరిచయం చేశాడు. సుడిగాడు సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన గుజరాతీ భామ మోనల్‌ గజ్జర్‌.  తెలుగు, తమిళ్‌, మళయాళం, గుజరాతీ భాషల్లో హీరోయిన్‌గా నటించింది. అటు బాలీవుడ్‌లోనూ రెండు సినిమాలు చేసింది. సీజన్‌ 4లో ఉన్న ఒన్‌ అండ్ ఓన్లీ హీరోయిన్‌ మోనల్‌ గజ్జర్‌. ఇంట్లోకి వెళ్లిన గజ్జర్‌ హౌజ్‌ మొత్తం కలియతిరిగింది. అమ్మను మిస్‌ అవుతున్న అని ఏడ్చేసింది. 


సూర్యకిరణ్
రెండో కంటెస్టెంట్‌గా డైరెక్టర్‌ సూర్యకిరణ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఆయన కోసం ఏవీ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన గతంలోని కష్టసుఖాలను పంచుకున్నారు. తన గతంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. మోనాల్‌ ని పరిచయం చేసుకున్నారు.  తెలుగులో తొలి చిత్రం సత్యంతోనే మంచి హిట్‌ అందుకున్నారు. హీరోయిన్‌ కళ్యాణిని వివాహం చేసుకున్నారు. 


యాంకర్‌ లాస్య 
మూడో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి  ఎంటరయ్యారు యాంకర్‌ లాస్య. వివాహం అయిన తర్వాత లాస్య టీవీకి దూరమైయ్యారు. ఇప్పుడు బిగ్‌బాస్‌ 4తో మళ్లీ రిఎంట్రీ ఇవ్వబోతున్నారు. లాస్యకు సంబంధించిన ఓ ఏవీ ప్రదర్శించారు. తానేంటో చూపించడానికి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వస్తున్నానని లాస్య చెప్పింది. తనకో చిన్న బాబు ఉన్నాడని, అతని బాగోగులు కుటుంబ సభ్యులకు అప్పగించి బిగ్‌బాస్‌లోకి వచ్చానని లాస్య చెప్పింది. లాస్య కొడుకు జున్నుకు సంబంధించి ఓ ఏవీ ప్రదర్శించారు. అనంతరం లాస్యకు నాగార్జున ఓ స్పెషల్‌ గిప్ట్‌ ఇచ్చాడు. ఈ సందర్భంగా లాస్య చెప్పిన చీమ- ఏనుగు కథ నవ్వులు పూయించింది.


అభిజిత్‌
బిగ్‌బాస్‌ నాలుగో కంటెస్టెంట్స్‌గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు లైఫ్‌ ఈజ్‌ బ్యూటీవుల్‌ హీరో అభిజిత్‌. ఆయన ఓ సాంగ్‌ తో ఎంటరయ్యాడు. అయితే ఈ సందర్భంగా అభిజిత్‌ `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌` చిత్రంలో అమలతో కలిసి నటించానని నాగ్‌తో చెప్పాడు. ఈ సందర్భంగా అభిజిత్‌కు నాగ్‌ ఓ చిలిపి ప్రశ్న అడిగాడు. కాజల్‌, పూజా హెగ్డే, తమన్నా ఫోటోలను చూపించి వీరిలో ఎవరితో డేటింగ్‌, ఎవరిని పెళ్ళి, ఎవరికి ముద్దు పెట్టుకుంటావని అడగ్గా, అభిజిత్‌ కాజల్‌తో డేట్‌ చేస్తానని, పూజాని పెళ్ళి చేసుకుంటానని, తమన్నాకు ముద్దు పెడతానని చెప్పాడు. లైఫ్‌ ఈజ్‌ బ్యూటిపుల్‌  చిత్రంతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అభిజిత్.. మిర్చీలాంటి కుర్రాడు సినిమాతోనూ అలరించాడు. ఆ తరువాత యుఎస్ వెళ్లాడు.


సుజాత
ఐదో కంటెస్టెంట్స్‌గా యాంకర్‌ సుజాత వచ్చేసింది. స్టేజి మీద తెలంగాణ యాసలో దుమ్ము లేపారు. నాగార్జునకు బిట్టు అని ముద్దు పేరు పెట్టింది. తెలంగాణలో యాసలో వార్తలతో ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ యాసతో పాపులర్‌ అయిన న్యూస్‌ యాంకర్స్‌లో సూజత ఒకరు. ఆమె హౌజ్‌లోకి రాగాజే మోనాల్‌ గజ్జర్‌ తననుతాను పరిచయం చేసుకుంది. ఆ తర్వాత కూడా మిగతా వాళ్లు కూడా పరిచయం చేసుకున్నారు. ఇక సుజాత తీసుకొచ్చిన బాక్స్‌లో ఏ నెంబర్‌ ఉందో చెప్పమని కోరగా.. సుజాత కాసేపు ఆటపట్టించింది. 

మెహబూబ్‌ దిల్‌సే
ఆరో కంటెస్టెంట్‌గా టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్ మెహబూబా దిల్‌ సే ఎంట్రీ ఇచ్చారు. గుంటూరు నుంచి వచ్చిన మెహబూబ్‌ తన జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. అతనికో గిఫ్ట్‌ ఇచ్చి లోపలికి పంపించాడు. హౌజ్‌లోకి వచ్చిన మెహబూబ్‌  తనను తాను పరిచడం చేసుకున్నాడు.


దేవి నాగవల్లి
ఏడో కంటెస్టెంట్‌ టీవీ9 టీవీ యాంకర్‌ దేవి నాగవల్లి ఎంటర్‌ అయ్యారు. హౌస్‌లోకి వస్తూనే విజేతను అవుతానని నమ్మకంగా చెప్పింది. ఇప్పటివరకు ఒక్క లేడీ బిగ్‌బాస్‌ కూడా లేరు కాబట్టి తనకు అవ్వాలని ఉందని దేవి చెప్పింది. ఇటు యాంకరింగ్‌లోనూ, అటు రిపోర్టింగ్‌లోనూ దిట్ట.  ఆమె న్యూస్‌ ప్రజెంటేషన్‌తో పాటు.. వస్త్రధారణ, హెయిర్ స్టైయిల్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది.రాజమండ్రికి చెందిన దేవి నాగవల్లి.. జర్నలిజంపై మక్కువతో మాస్ కమ్యునికేషన్‌లో డిప్లమో చేసి బ్రేకింగ్ న్యూస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న టీవీ 9తో కెరియర్ మొదలుపెట్టారు. ప్రజెంటేషన్‌లో తన మార్క్ చూపిస్తే అతి తక్కువ కాలంలోనే పాపులర్ న్యూస్ ప్రజెంటర్‌గా పాపులర్ అయ్యారు. 


దేత్తడి హారిక 
ఎనిమిదో కంటెస్టెంట్స్‌గా యూట్యూబ్‌ స్టార్‌ దేత్తడి హారిక ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్‌ 3 టైమ్‌లో కూడా హారిక పేరు సోషల్‌ మీడియా లో వినిపించింది. కానీ తను అప్పుడు సెలక్ట్‌ కాలేదు. ఈ సీజన్‌కి మాత్రం బిగ్‌బాస్‌ టీమ్‌ ఫోకస్‌ హారిక పై పడింది. హైదరాబాద్‌కి చెందిన హారిక అతి తక్కువ సమయంలో టాప్‌ యూ ట్యూబ్‌ స్టార్స్‌లో ఒకరు గా ఎదిగారు. అమెజాన్‌లో జాబ్‌ చేస్తూ సరదగా ఒక షార్ట్‌ ఫిల్మ్‌లో యాక్ట్‌ చేసింది హారిక. ఇప్పుడు అదే హారికకు నెటిజన్స్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. 


సయ్యద్ సోహైల్
తొమ్మిదో కంటెస్టెంట్‌గా టీవీ నటుడు  సయ్యద్ సోహైల్ వచ్చాడు. ఈ ఏడాది విడుదలైన యురేకా చిత్రంలో సోహెల్‌ నటించారు. ఇస్మార్ట్‌ సొహెల్‌గా గుర్తింపు పొందారు.


అరియానా గ్లోరీ
పదో కంటెస్టెంట్‌గా యాంకర్‌ అరియానా గ్లోరీ వచ్చింది. జెమిని కెవ్వు కామెడీ యాంకర్‌గా అరియానా ఫేమస్‌ అయ్యారు. ఐయామ్‌ బోల్ట్‌ అంటూ ఆమె ఎంట్రీ ఇచ్చారు. సోహైల్‌,అరియానా గ్లోరీలను బిగ్‌బాస్‌లోకి కాకుండా నేబర్‌ హౌజ్‌లోకి పంపారు.


అమ్మ రాజశేఖర్‌
11వ కంటెస్టెంట్స్‌గా డైరెక్టర్‌ అమ్మ రాజశేఖర్‌ ఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే ఈ సాంగ్‌ నాగార్జునకు డెడికేట్‌ చేస్తూన్నఅంటూ కింగ్‌ సినిమాలోని పాటకు స్టెప్పులేశాడు. కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దర్శకుడుగా మారిన టెక్నీషి యన్‌. గోపిచంద్‌ రణం, రవితేజ ఖతర్నాక్‌, నితిన్‌ టక్కరి చిత్రాలకు దర్శకత్వం వహించారు అమ్మా రాజశేఖర్‌. ఆన్‌స్క్రీన్‌ మీదే కాదు. ఒకటి, రెండు వివాదాలతో ఆఫ్‌ స్క్రీన్‌ మీద కూడా పాపులర్‌ అయ్యారు.


కరాటే కల్యాణి
12 వ కంటెస్టెంట్‌గా కరాటే కల్యాణి ఎంట్రీ ఇచ్చింది. కృష్ణ సినిమాలోని బా..బీ.. డైలాగ్‌తో ఆమె ఫేమస్‌ అయ్యారు. పేరులో మార్షల్‌ ఆర్ట్స్‌ ఉన్నా సిల్వర్‌స్క్రీన్‌ మీద మాత్రం నవ్వులను పూయిస్తూ ఉంటుంది కరాటే కళ్యాణి. సిల్వర్‌ స్క్రీన్‌ మీద కాదు. యూనియన్‌ వ్యవహారాల్లో కూడా చురుగ్గా కనిపిస్తూ ఉంటారు కరాటే కళ్యాణి. ఈ సీజన్‌లో 12వ కంటెస్టెంట్‌గా హోస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు కళ్యాణి. ఇక తన గురించి చెబుతూ.. తనను అందరూ మోసం చేశారని ఏడ్చేసింది. తనకు పిల్లలు లేరని, ఓ బాబును దత్తత తీసుకొని పెంచుకుంటున్నానని కంటతడి పెట్టింది. తనను తాను తెలుసుకోవడానికే బిగ్‌బాస్‌లోకి వస్తున్నానని చెప్పింది. నాగార్జున కోసం బిగ్‌బాస్‌పై హరికథ చెప్పి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 


నోయల్‌
13వ కంటెస్టెంట్‌గా సింగర్‌ నోయల్‌ వచ్చాడు. నోయల్‌ సింగర్‌తో పాటు యాంకర్‌, యాక్టర్‌గా కూడా అందరికీ సుపరిచి తుడే. ది షేక్‌ గ్రూప్‌ పేరుతో ఒక తెలుగు బ్యాండ్‌ని కూడా నిర్వహిస్తున్నాడు నోయల్. అటు నేపథ్య గాయకుడుగా కూడా కూడా సక్సెస్‌ అయ్యారు నోయల్‌. తన ఫ్యామిలీకి నేను బయట ఎలా ఉంటానో తెలియజేయడానికే బిగ్‌బాస్‌-4కు వచ్చాడు. బిగ్‌బాస్‌ షోపై ర్యాపో సాంగ్‌ పాడుతూ.. పనిలో పనిగా నాగార్జునను కూడా పొగిడేశాడు. ఎప్పుడూ చలాకీగా ఉండే నోయల్‌ హోస్‌లో మరింత ఎంత సందడి చేస్తాడో చూడాలి. 


దివి
14వ కంటెస్టెంట్‌గా దివి వచ్చేసింది. నటన అంటే ఇష్టంతో మోడలింగ్‌ చేసి, అట్నుంచి నటిగా మారినట్టు దివి చెప్పుకొచ్చింది. మొదల పలు వెబ్‌ సిరీస్‌లలో నటించినట్టు తెలిపింది. ఇప్పుడు సినిమాలు చేస్తున్నానని పేర్కొంది. బిగ్‌బాస్‌ 4తో బ్రేక్‌ పొందుతాని దివి ధీమా వ్యక్తం చేసింది.


అఖిల్‌
15వ కంటెస్టెంట్‌గా నటుడు అఖిల్‌ ఎంటరయ్యాడు. నాగ్‌ నటించిన `సిసింద్రి`సినిమా విడుదలైన మరుసటి రోజు. నాగ్‌ నటించిన `సిసింద్రి`సినిమా విడుదలైన మరుసటి రోజున అఖిల్‌ జన్మించాడు. అందుకే తనకు అఖిల్‌ పేరు పెట్టారట. రెండేళ్ళ క్రితం తన లవ్‌ ఫెయిల్‌ అయినట్టు తెలిపాడు. తాను నిజాయితీగా ఉంటానని తెలిపాడు. అంతేకాదు నాగ్‌ ముందు యాభై డిప్స్ కొట్టి ఆశ్చర్యపరిచారు.


 గంగవ్వ
16వ కంటెస్టెంట్‌గా యూట్యూబ్‌ స్టార్‌ గంగవ్వ గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. స్పెషల్‌ కంటెస్టెంట్‌గా తెలంగాణ యాసతో ఆకట్టుకుంటున్న గంగవ్వ ఎంటర్‌ అయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా తన కష్టాలు చెప్పుకుని అందరిని ఏడిపించేసింది. ఆమె బాధలు విని నాగ్‌ సైతం భావోద్వేగానికి గురయ్యారు. పల్లెటూరి అమాయకత్వం. లోకాన్ని చదివిన అనుభవం. తెలంగాణ యాసలోని కమ్మదనం. అన్నీ కలిపితే గంగవ్వే. 58 ఏళ్ల గంగవ్వ టాప్‌ యూ ట్యూబ్‌ స్టార్స్‌లో ఒకరు. మై విలేజ్‌ షో తో ఫేమస్‌ అయిన గంగవ్వ నేషనల్‌ మీడియాని కూడా ఆకర్షించారు. స్కిట్‌ కాన్సెప్ట్‌ చెబితే చాలు. స్ర్కిప్ట్‌ అక్కర్లేదు. అంతటి టాలెంట్‌ గంగవ్వ సొంతం. 

సోషల్‌ మీడియాలో లీకైన లిస్టే.. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకుల్లో అంతగా ఉత్కంఠ కనపడలేదు. ఈ16 మంది పేర్లు శనివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. వారే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. స్టార్‌ మా బృందం కడవరకు సస్పెన్స్‌ మెయింటెన్‌ చేసినా కూడా లీకులు మాత్రం ఆగలేదు. 15 వారాల పాటు పదహారు మందితో సాగే ఈ షో.. రేపటి నుంచి కంటెస్టెంట్ల గొడవలు, ప్రేమలు, కోపాలు, అలకలతో రక్తికట్టించబోతోంది. [ చదవండి: బిగ్‌బాస్‌ 4 ప్రోమో : ఒక్క డైలాగ్‌తో తేల్చేసిన గంగవ్వ ]

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement