బిస్‌బాస్‌-5 : ఇదిగో 19 మంది కంటెస్టెంట్స్‌ | Bigg Boss 5 Telugu Premiere Episode Grand Launch | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: బుల్లితెర హంగామా మొదలైంది

Published Sun, Sep 5 2021 6:10 PM | Last Updated on Tue, Sep 7 2021 10:41 AM

Bigg Boss 5 Telugu Premiere Episode Grand Launch - Sakshi

తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. కింగ్ నాగార్జున వరసగా మూడో సారి వ్యాఖ్యాతగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులు ఇచ్చేందుకు సిద్ధమైంది. కరోనా కాలంలో వస్తాడో రాడో అనుకున్న సమయంలో ‘చెప్పండి బోర్‌డమ్‌కి గుడ్‌బై’ అంటూ స్మాల్‌ స్క్రీన్‌పైకి వచ్చేశాడు బిగ్‌బాస్‌.

స్టార్‌ మాలో సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షోలో తారాజువ్వల వెలుగులో గ్రాండీయర్‌గా ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్‌ నాగార్జున. బోర్‌డమ్‌ను కిల్‌ చేస్తూ స్టేజీమీదకు గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన నాగ్‌ మిస్టర్‌ మజ్ను పాటకు స్టెప్పులేశాడు.పంచ అక్షరాల సాక్షి, పంచేద్రియాల సాక్షిగా, పంచ భూతాల సాక్షి నా పంచ ప్రాణాలు మీరే అంటూ అభిమానులను పలకరించాడు. అనంతరం బిగ్‌బాస్‌ హౌస్‌లో వెళ్లి ఇళ్లంతా తిరుగుతూ సందడి చేశాడు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో ఎప్పుడూ లేనంత రిచ్ గా కనిపిస్తోంది.  డైనింగ్ టేబుల్, హాల్, బెడ్ రూములు, స్విమ్మింగ్ పూల్... ఇలా ప్రతి అంశం కలర్ ఫుల్ గా కనిపిస్తోంది.  ఈసారి ప్రేక్షకులకు ఐదు రెట్ల ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తానంటున్నాడు.

తొలి కంటెస్టెం‍ట్స్‌గా సిరి హన్మంత్‌

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో తొలి కంటెస్టెం‍ట్స్‌గా సిరి హన్మంత్‌ ఎంట్రీ ఇచ్చింది. క్రాక్‌ సినిమాలోని భూమ్‌ బద్దల్‌ సాంగ్‌కి తనదైన శైలిలో స్టెప్పులేస్తూ బిగ్‌బాస్‌ స్టేజీపైకి వచ్చింది. ఆమెకు కింగ్‌ నాగ్‌ సాదరంగా స్వాగతం పలికాడు. అనంతరం సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు మూవీలోని‘ నాకు నచ్చినవి రెండే రెండు.. ఒకటి  నిద్ర, ఇంకొకటి మంచి మొగుడు’ డైలాగ్స్‌ని నవరాసాల్లో ఏవైనా ఐదు రకాలుగా చెప్పమని నాగ్‌ టాస్క్‌ ఇచ్చాడు. సిరి ఐదు రసాల్లో డైలాగ్‌ చెప్పి ఇంట్లోకి వెళ్లింది. 

న్యూస్‌ రీడర్‌ కెరీర్‌ ఆరంభించి..
విశాఖపట్నంలో ప్రాంతీయ ఛానల్‌లో న్యూస్‌ రీడర్‌గా పని చేసిన సిరి హన్మంత్‌  ఆ తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయింది. ఇక్కడ కూడా న్యూస్‌ రీడర్‌గా వర్క్‌ చేసిన సిరికి బుల్లితెర సీరియల్‌లో నటించే ఆఫర్‌ రావడంతో ఆమె నటన వైపు అడుగులు వేసింది. అదే ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆమె నటించిన వెబ్‌ సిరీస్‌, షార్ట్‌ ఫిలింస్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచాయి. టీవీలో ప్రసారమయ్యే స్పెషల్‌ ఈవెంట్లకు కూడా ఈమెకు  ప్రత్యేక ఆహ్వానాలు అందుతుండటం విశేషం. మరి యూట్యూబ్‌ ద్వారా జనాలను అలరించిన ఈ భామ బిగ్‌బాస్‌ షోలో ఎంత సందడి చేస్తుందో చూడాలి!

రెండో కంటెస్టెంట్‌గా వీజే సన్నీ

రెండో కంటెస్టెంట్‌గా వీజే సన్నీ గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం తన డ్రీమ్‌ గర్ల్‌ ఫోటోని డ్రాయింగ్‌ వేసి చూపించమని నాగ్‌ టాస్క్‌ ఇచ్చాడు. సన్నీ భయపడుతూనే డ్రాయింగ్‌ వేసి ఇంట్లోకి వెళ్లాడు. తనకి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పింది సిరి హన్మంత్‌. వెళ్తూనే పులిహోరా కలిపేశాడు సన్నీ. చాలా అందంగా ఉన్నావని, నా డ్రీమ్‌ గర్ల్‌కి హెయిర్‌కి నీ హెయిర్‌కి తేడా ఉందని చెప్పాడు. తర్వాత బిగ్‌బాస్‌ ఇళ్లంతా తిరిగి చూశారు. 

ఎవరీ వీజే సన్నీ?
కళ్యాణ వైభోగమే సీరియల్‌తో బాగా పాపులర్‌ అయ్యాడు సన్నీ. ఈ సీరియల్‌ నుంచి ఆయనకు అమ్మాయిల ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగిపోయింది. ఇతడిని ఫ్యాన్స్‌ అంతా బుల్లితెర జూనియర్‌ ఎన్టీఆర్‌ అని ప్రేమగా పిలుచుకుంటారు. గతంలో యాంకరింగ్‌ చేసిన అతడు కళ్యాణ వైభోగమే సీరియల్‌తో వచ్చిన పాపులారిటీతో ఏకంగా సినిమా ఛాన్స్‌ అందుకున్నాడు. సకలగుణాభిరామ సినిమాలో నటించిన ఈ మోడల్‌ బిగ్‌బాస్‌లో ఏమేరకు అలరిస్తాడో చూడాలి!

మూడో కంటెస్టెంట్‌గా లహరి షారి

మూడో కంటెస్టెంట్‌గా లహరి షారి ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే నాగ్‌కు రోజ్‌ ఇచ్చి ప్రపోజ్‌ చేసింది. నాగ్‌ కూడా లహరికి ఒక రోజ్‌ ఇచ్చి ఇంట్లో ఎవరైనా నచ్చితే ఇవ్వమని చెప్పారు. లహరికి సిరి, వీజే గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. ఆమెతో కూడా వీజే పులిహోర కలిపేశాడు. 

యాంకర్‌, న్యూస్‌ రీడర్‌, జర్నలిస్టు, మోడల్‌, నటిగా పాపులర్‌ అయింది లహరి షారి. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే ఈమె అర్జున్‌ రెడ్డిలో డాక్టర్‌గా నటించింది. మళ్లీ రావా సినిమాలో హీరో సుమంత్‌ స్నేహితురాలిగా ఆకట్టుకుంటుంది. సారీ నాకు పెళ్లైంది, జాంబిరెడ్డి తదితర చిత్రాల్లో నటించిన లహరి బిగ్‌బాస్‌ వీక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి!

నాలుగో కంటెస్టెంట్‌గా సింగర్‌ శ్రీరామచంద్ర

నాలుగో కంటెస్టెంట్‌గా ప్రముఖ సింగర్‌ సింగర్‌ శ్రీరామచంద్ర ఎంట్రీ ఇచ్చాడు. మెలోడీతో మాస్‌ సాంగ్స్‌ పాడి స్టేజ్‌ని ఉర్రూతలూగించాడు. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడానికే బిగ్‌బాస్‌లోకి వచ్చానని చెప్పాడు. అనంతరం నాగ్‌ కోసం ‘ఆమని పాడవే తీయగా..’అనే పాట పాడి హౌస్‌లోకి వెళ్లి పోయాడు. 

9 భాషల్లో 500కు పైగా పాటలు
సింగర్‌ శ్రీరామచంద్ర..  9 భాషల్లో కలిపి 500కు పైగా పాటలు పాడాడు. 2010లో ఇండియన్‌ ఐడల్‌ షో విన్నర్‌గా నిలిచి దేశవ్యాప్తంగా సెన్సేషనల్‌ అయ్యాడు. తాజాగా అతడు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో నాలుగో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తను నిజంగా శ్రీరామచంద్రుడినే అంటున్న అతడు తెలుగు పాటలు పాడుతూ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తానంటున్నాడు. ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మళ్లీ దగ్గరవుతానని కొండంత ఆశతో హౌస్‌లో అడుగుపెట్టాడు. మరి అతడి గాత్రంతో ఎంతమందిని తనవైపు తిప్పుకుంటాడో చూడాలి!
 

ఐదో కంటెస్టెంట్‌గా యానీ మాస్టర్‌

ఐదో కంటెస్టెంట్‌గా యానీ మాస్టర్‌ ఎంట్రీ ఇచ్చారు. గత నాలుగు సీజన్స్‌ అబ్బాయిలు విన్‌ అయ్యారు. ఈ సారి కచ్చితంగా అమ్మాయిలు విజేతగా నిలవాలని, అందుకే తాను బిగ్‌బాస్‌లోకి వచ్చానని చెప్పింది యానీ మాస్టర్‌. ఇక స్టెజ్‌పైకి వచ్చిన యానీకి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పాడు కింగ్‌ నాగ్‌. అలాగే సర్‌ప్రైజ్‌ అంటూ ఆమె భర్త, కుమారుడితో మాట్లాడించాడు. ఇక హౌజ్‌లోకి వెళ్లే ముందు మీతో ఒక స్టెప్పు వేయాలని యానీ అడగ్గా.. ఇప్పుడు కాదంటూ ఆమె కోరికను సున్నితంగా తోసిపుచ్చాడు నాగ్‌. బాధపడుతూనే హౌస్‌లోకి వెళ్లింది యానీ మాస్టర్‌. 

ఆరో కంటెస్టెంట్‌గా లోబో

ఆరో కంటెస్టెంట్‌గా లోబో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు. తన ఫ్యామిలీకి సంబంధించన విషయాలు చెబుతూ ఎమోషనల్‌కు గురయ్యాడు. ‘పాగల్‌’సాంగ్‌కు స్టెప్పులేస్తూ తనదైన స్టెల్లో బిగ్‌బాస్‌ స్టేజ్‌ మీదకు వచ్చాడు.

ఇక లోబో విషయానికి వస్తే.. ఇతని అసలు పేరు మహమ్మద్‌ ఖయ్యూం. ఎనిమిది తరగతికే చదువు మానేసిన లోబో హైదరాబాదీ యాసలో యాంకరింగ్‌ చేస్తూ జనాలను అలరించాడు. తన కట్టుబొట్టు, మాట తీరు అన్నీ విభిన్నంగా ఉండటం కూడా అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. నిజానికి లోబో గతంలోనే బిగ్‌బాస్‌ షోలో పాల్గొనాల్సింది కానీ అతడు తన ఎంట్రీని ముందుగానే లీక్‌ చేయడంతో నిర్వాహకులు తనను షోలోకి తీసుకోలేదు. ఇక బిగ్‌బాస్‌ అంతా స్క్రిప్టెడ్‌ అన్న లోబో షోలో అడుగుపెట్టాక తన మాట వెనక్కు తీసుకుంటాడా? ఏం జరుగుతుంది? అన్నది సస్పెన్స్‌గా మారింది.

ఏడో కంటెస్టెంట్‌గా సినీ నటి ప్రియ

ఏడో కంటెస్టెంట్‌గా సినీ నటి ప్రియ ఎంట్రీ ఇచ్చారు. ఇంత బిజీగా ఉన్నా కూడా బిగ్‌బాస్‌లోకి ఎందుకు వచ్చావు అని నాగ్‌ అడగ్గా.. తన గురించి తాను తెలుసుకోవడానికే ఇక్కడి వచ్చానని చెప్పింది. ఆమెను సర్‌ప్రైజ్‌ చేస్తూ ప్రియ కొడుకుతో మాట్లాడించాడు. అనంతరం ఆమెని ఇంట్లోకి పంపించాడు. 

ప్రియ విషయానికొస్తే.. ఆమె అసలు పేరు మామిళ్ల శైలజ ప్రియ. 1998లో వచ్చిన మాస్టర్‌ మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు ప్రియసఖి సీరియల్‌కు నంది అవార్డు అందుకుంది. హీరోహీరోయిన్లకు అక్క, తల్లి, అత్త, వదిన, పిన్ని.. ఇలా పలు సహాయక పాత్రల్లో ఒదిగిపోయిన ప్రియ సుమారు 60 సినిమాల్లో నటించింది. బుల్లితెర, వెండితెర.. కాదేదీ వినోదానికి అనర్హం అన్నట్లుగా రెండుచోట్లా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ప్రియ ఇప్పటివరకు ఎలాంటి వివాదంలో తలదూర్చకపోవడం ఆమె వ్యక్తిత్వాన్ని చాటిచెప్తోంది. 2002లో కిషోర్‌ను పెళ్లాడిన ఆమెకు నిశ్చయ్‌ అనే బాబున్నాడు. మరి గొడవలకు దూరంగా ఉండే ప్రియ బిగ్‌బాస్‌ హౌస్‌లో కూడా అదే నియమాన్ని పాటిస్తుందా? తన సహనంతో మరింతమంది అభిమానులను సంపాదించుకుంటుందా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది

ఎనిమిదో కంటెస్టెంట్‌గా మోడల్‌ జెస్సీ

ఎనిమిదో కంటెస్టెంట్‌గా మోడల్‌ జెస్సీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక జెస్సీ గురించి నాగ్‌ చెబుతూ.. ఆయన ఒక సూపర్‌ మోడల్‌ అని, ర్యాంప్‌ వాక్‌ నేర్పిస్తాడు. 36 గంటల పాటు ర్యాంప్‌ వాక్‌ చేయిస్తూ రికార్డు క్రియేట్‌ చేశాడని చెప్పాడు. అనంతరం అతనితో ర్యాంప్‌ వాక్‌ చేయించి హౌస్‌లోకి పంపించాడు. 

పలు యాడ్స్‌లో నటించిన మోడల్‌ జెస్సీ అసలు జశ్వంత్‌ పడాల పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే స్టైలిష్‌ లుక్స్‌తో, జిమ్‌ బాడీతో హౌస్‌లో అడుగు పెట్టిన అతడు బిగ్‌బాస్‌ షో ద్వారా చాలా తొందరగానే ప్రేక్షకులకు అందులోనూ అమ్మాయిలకు కనెక్ట్‌ అవుతాడని చెప్పవచ్చు. మోడలింగ్‌ రంగంలో పలు అవార్డులు అందుకున్న ఇతడు ఎంత మంచివాడవురా సినిమాతో నటనారంగంలోకి కూడా ప్రవేశించాడు. మరి అతడు హౌస్‌లో ఎలా నిలదొక్కుకుంటాడన్నది సస్పెన్స్‌గా మారింది.


తొమ్మిదో కంటెస్టెంట్‌గా ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక సింగ్‌

తొమ్మిదో కంటెస్టెంట్‌గా ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక సింగ్‌ ఎంట్రీ ఇచ్చారు.  బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఆమె గురించి ఓ ఏవీ వేశారు  బిగ్ బాస్ యాజమాన్యం. చాలా మందికి ఆదర్శంగా నిలిచావని ఆమెను కొనియాడాడు కింగ్‌ నాగ్‌. ఇక ఈ సందర్భంగా తన ఫ్యామిలీ గురించి చెబుతూ ఎమోషనల్‌కు గురయ్యారు ప్రియాంక. తన నాన్నకు కల్లు కనిపించవని, తాను ట్రాన్స్‌ జెండర్‌గా మారిన విషయం కూడా ఆయనకు తెలియదని చెప్పింది. పెళ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలో అమ్మాయికి అన్యాయం చేయ్యొద్దనే ఉద్దేశంలో ట్రాన్స్‌జెండర్‌గా మారానని చెప్పింది. ఒకే ఒక్క రోజు నిర్ణయం తీసుకొని జెండర్‌ మారానని చెప్పింది. 

జబర్దస్త్‌ షోలో లేడీ గెటప్‌తో ప్రేక్షకులకు చేరువయ్యాడు సాయితేజ. ఇందులో చీరకట్టి గాజులేసుకునే సాయితేజ తర్వాత ఆపరేషన్‌ చేసుకుని నిజంగానే అమ్మాయిగా మారిపోయాడు. ప్రియాంక సింగ్‌గా పేరు మార్చుకుని అతడు కాస్తా ఆమెగా రూపాంతరం చెందాడు. చిన్నప్పటి నుంచీ అమ్మాయిగా ఉండటానికే ఇష్టపడ్డానన్న ఆమె హౌస్‌లో ఎలా ఉండబోతుంది? అందరితో చనువుగా కలిసిపోతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

పదోవ కంటెస్టెంట్‌ షణ్ముఖ్‌

10వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు షణ్ముఖ్ జస్వంత్. అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు షణ్ముఖ్.ఈ మధ్యకాలంలో యూత్‌కు బాగా కనెక్ట్‌ అయిన పేరు షణ్ముఖ్‌ జస్వంత్‌.  డ్యాన్స్‌ వీడియోలు, షార్ట్‌ ఫిలింస్‌, వెబ్‌ సిరీస్‌తో యూట్యూబ్‌ స్టార్‌గా మారాడు. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, సూర్య వెబ్‌ సిరీస్‌లకు లక్షల్లో వ్యూస్‌ ఉన్నాయి. ఈ యూత్‌ స్టార్‌కు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. బిడియంతో ముడుచుకుపోయే షన్నూ ఎంట్రీ సాంగ్‌తో మాత్రం స్టేజీ దద్దరిల్లిపోయేలా చేశాడు. ఇక ఇతడి మీద కొండంత ఆశలు పెట్టుకున్నారు ఆయన అభిమానులు. మరి వారి అంచనాలను షన్నూ అందుకుంటాడా? హౌస్‌లో ఎలా రాణిస్తాడు? అన్నది చూడాల్సిందే!

పదకొండవ కంటెస్టెంట్‌గా హమీదా

పదకొండవ కంటెస్టెంట్‌గా అదిరిపోయే డాన్స్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చింది నటి హమీదా. సాహసం సేయరా డింభకా సినిమాలో నటించింది. అందంచందం ఉన్నప్పటికీ ఈమెకు పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో టాలీవుడ్‌లో పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ఈ నటి బిగ్‌బాస్‌ ద్వారా తన కెరీర్‌ను గాడిలో పెట్టాలనుకుంటోంది. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పదకొండో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన హమీదా.. అబ్బాయిల్లో తనకు హైట్‌, కళ్లు, చిరునవ్వు, హెయిర్‌ స్టైలింగ్‌ అంటే ఇష్టమని చెప్పింది. దీంతో బిగ్‌బాస్‌ స్క్రీన్‌పై ఇతర మేల్‌ కంటెస్టెంట్ల కళ్లు మాత్రమే చూపించాడు. అందులో ఒకరి కళ్లు తనకు బాగా నచ్చాయని చెప్పింది హమీదా. మరి ఆ కళ్లు ఎవరివి? వారి మధ్య స్నేహం చిగురిస్తుందా? అన్నది మున్ముందు తేలనుంది.

12వ కంటెస్టెంట్‌గా కొరియోగ్రాఫర్‌ నటరాజ్

బిగ్ బాస్ హౌస్‌లోకి 12వ కంటెస్టెంట్‌గా నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చాడు .కొరియోగ్రాఫర్‌ నటరాజ్‌ తెలుగులో వస్తున్న డ్యాన్స్‌ రియాలిటీ షోలకు ఓరకంగా ఆద్యుడని చెప్పవచ్చు. గతంలో ఉదయభానుతో కలిసి డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌ షో చేసిన నటరాజ్‌ పలు షోలకు కొరియోగ్రాఫర్‌గా, మెంటార్‌గా వ్యవహరించాడు. టాప్‌ హీరోలు, దర్శకులందరితో కలిసి పని చేసిన నటరాజ్‌ మాస్టర్‌కు 20 ఏళ్లకు పైనే అనుభవం ఉంది. కష్టాన్ని నమ్ముకోవాలని చెప్పే ఈ కొరియోగ్రాఫర్‌ మిగతా కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తాడా? హౌస్‌లో ఎన్ని రోజులు నిలదొక్కుకుంటాడన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

13వ కంటెస్టెంట్‌గా వచ్చింది సరయు

బిగ్ బాస్ హౌస్‌లోకి 13వ కంటెస్టెంట్‌గా వచ్చింది సరయు. ప్రత్యేక యాసతో ఉన్నదున్నట్లు మాట్లాడే సరయూ గురించి యూట్యూబ్‌ వీక్షకులకు తెలిసే ఉంటుంది. తను 7 ఆర్ట్స్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసే వెబ్‌ సిరీస్‌, షార్ట్‌ ఫిలింస్‌కు లక్షల్లో వ్యూస్‌ వస్తుంటాయి. బోల్డ్‌ వీడియోలు చేసే సరయూ హౌస్‌లో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. మరి సరయూ దూకుడును తోటి కంటెస్టెంట్లు తట్టుకుని నిలబడతారా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

14వ కంటెస్టెంట్‌గా నటుడు విశ్వా

బిగ్ బాస్ హౌస్‌లోకి 14వ కంటెస్టెంట్ గా వచ్చాడు సీరియల్ నటుడు విశ్వా. తన లైఫ్ గురించి ఓ ఏవీ వేసి చూపించాడు  బిగ్ బాస్. 'వచ్చిన ప్రతీ అవకాశాన్ని నిచ్చెనగా చేసుకుని ఒక్కో మెట్టు ఎదగడం మొదలుపెట్టాను. ఉక్కులు కరిగించే నిప్పుల సెగను ఊపిరిగా చేసుకుని, కన్నీళ్లను కండలు చిందించే చెమటగా మార్చి నేను నడిచేదారి కూడా తలవంచి నన్ను ముందుకు నడిపేవరకు, నేను కన్న కల నిజమయ్యేవరకు ప్రయత్నిస్తూనే ఉంటా'నంటున్నాడు విశ్వ.నాగార్జున నిర్మించిన యువ తన తొలి సీరియల్‌ అని, నాగచైతన్య ఫస్ట్‌ మూవీలోనూ నటించానని, అఖిల్‌ నేను కలిసి చదువుకున్నామని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పద్నాలుగో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన విశ్వ తన కండలతో యాపిల్‌ను నుజ్జునుజ్జు చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. అక్కినేని ఫ్యామిలీలో అందరితోనూ పరిచయం ఉన్న ఈ బాడీ బిల్డర్‌, నటుడు హౌస్‌లో ఎలా ఉంటాడనేది చూడాలి!

15వ కంటెస్టెంట్‌గా నటి ఉమాదేవి

బిగ్‌బాస్‌ 5లోకి 15వ కంటెస్టెంట్‌గా ‘కార్తిక దీపం’ సీరియల్‌ ఫేమ్‌ ఉమాదేవి ఎంట్రీ ఇచ్చారు. అనేక సినిమాల్లో సహాయక పాత్రలతో పాటు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్స్‌ చేసి ప్రేక్షకుల మెప్పు పొందింది ఉమాదేవి. సినిమాలతో పాటు సీరియళ్లలోనూ నటించిన ఆమె హౌస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. మరి హౌస్‌లో ఉన్న హీరోయిన్లకు ఆమె గట్టి పోటీనిస్తుందా? అన్నది వెరీ ఇంట్రస్టింగ్‌గా మారింది.

16వ కంటెస్టెంట్‌గా నటుడు మానస్‌

బిగ్‌బాస్‌లోకి 16వ కంటెస్టెంట్‌ నటుడు మానస్‌ ఎంట్రీ ఇచ్చాడు. బాల నటుడిగా కెరీర్‌ ఆరంభించాడు మానస్‌. సోడా గోలి సోడా, ప్రేమికుడు, గ్యాంగ్‌ ఆఫ్‌ గబ్బర్‌ సింగ్‌, కాయ్‌ రాజ్‌ కాయ్‌ వంటి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియళ్లతో పాటు పలు షోలు, షార్ట్‌ ఫిలింస్‌లోనూ నటించాడు. చూడటానికి సాఫ్ట్‌గా కనిపించే మానస్‌లోని మాస్‌ యాంగిల్‌ బిగ్‌బాస్‌ గేమ్‌ ద్వారా అయినా బయటపడుతుందేమో చూడాలి!

17వ కంటెస్టెంట్‌గా ఆర్జే కాజల్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి 17వ కంటెస్టెంట్‌గా  ఆర్జే కాజల్ ఎంట్రీ ఇచ్చారు. ఓ వీడియో ద్వారా తనను తాను పరిచయం చేసుకున్న కాజల్‌.. అనంతరం నాగార్జునతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది. అనంతరం ‘నరుడా ఓ నరుడా’పాటను  ఏస్ జానకిగారి గొంతుతో పాడి ఆకట్టుకుంది. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి వెళ్లే ముందు అందరితో పాటు నాగార్జునతో కూడా ఐలవ్యూ చెప్పించుకోవడమే తన లక్ష్యమని కాజల్‌ చెప్పగా.. వెంటనే ఐలవ్యూ చెప్పి షాకిచ్చాడు నాగ్‌. అనంతరం ఆమెను బిగ్‌బాస్‌ ఇంట్లోకి పంపాడు. 

వాగుడుకాయ, మల్టీ టాలెంటెడ్‌. యూట్యూబర్‌గా, రేడియో జాకీగా, వీడియో జాకీగా, సింగర్‌గా, యాంకర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పని చేసింది కాజల్‌. యూట్యూబ్‌లో ఎంతో ఫేమస్‌ అయిన కాజల్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇంకెంత ఫేమస్‌ అవుతుందనేది చూడాల్సిందే!

18వ కంటెస్టెంట్‌గా శ్వేత వర్మ

18వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్వేత వర్మ. బిగ్ బాస్ వేదిక పై బ్యూటీఫుల్ డాన్స్‌తో ఆకట్టుకుంది శ్వేత వర్మ.శ్వేత వర్మ ముక్కుసూటి మనిషి. ఎంత అందంగా ఉంటుందో అంత నిర్మొహమాటంగా మాట్లాడుతుంది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని గట్టిగా వాదించినవారిలో ఈమె ఒకరు. ఎంతో డేర్‌ అండ్‌ డాషింగ్‌గా కనిపించే ఈ భామ ద రోజ్‌ విల్లా, ముగ్గురు మొనగాళ్లు, పచ్చీస్‌, సైకిల్‌ తదితర చిత్రాల్లో నటించింది. మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్న ఈ భామ తన ముక్కుసూటితనంతో ఇంట్లో తగాదాలు కొనితెచ్చుకుంటుందా? మిగతా కంటెస్టెంట్లకు కొరకరాని కొయ్యగా మారనుందా? అనేది మున్ముందు తెలియనుంది.

19వ కంటెస్టెంట్‌గా యాంకర్‌ రవి

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి 19వ కంటెస్టెంట్‌గా యాంకర్‌ రవి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు.రవికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు నాగార్జున. రవి ముద్దుల కూతురితో అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పించాడు నాగ్. అలాగే తన కూతురు ఆడుకునే ఓ బొమ్మను కూడా ఇచ్చాడు.

యాంకర్‌ రవి... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని యూత్‌ ఉండరంటే అతిశయోక్తి కాదు.  కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ ఆరంభించిన రవి అనంతర కాలంలో యాంకరింగ్‌ వైపు అడుగులు వేశాడు. ఈ క్రమంలో లాస్యతో కలిసి చేసిన సమ్‌థింగ్‌ స్పెషల్‌ ప్రోగ్రామ్‌ వీళ్లిద్దరికీ మంచి పేరు తీసుకొచ్చింది. ఈ ఆన్‌స్క్రీన్‌ పెయిర్‌ను ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డారు. దీంతో ఈ జంట ఎన్నో ప్రోగ్రామ్‌లు చేసింది. తక్కువ కాలంలోనే రవి మోస్ట్‌ వాంటెడ్‌ యాంకర్‌గా పేరు గడించాడు. అయితే తర్వాత రవికి కొన్ని ఒడిదుడుకులు ఎదురవగా.. వాటిని తట్టుకుని, ఎదిరించి ఇప్పటికీ యాంకర్‌గా రాణిస్తూ కోట్లాదిమందిని ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడాయన. యాంకరింగ్‌ అంటే ప్రాణం అని చెప్తున్న ఇతడు 2017లో ఇది మా ప్రేమకథ సినిమాతో హీరోగానూ లక్‌ పరీక్షించుకున్నాడు. ఈ సినిమా బెడిసికొట్టడంతో సినిమాలు పెద్దగా వర్కవుట్‌ కాదని గ్రహించిన రవి బుల్లితెర ద్వారానే జనాలను అలరిస్తున్నాడు. వన్‌ షో, ఢీ జూనియర్స్‌, ఫ్యామిలీ సర్కస్‌, మొండి మొగుడు పెంకి పెళ్లాం, కిరాక్‌, అలీ టాకీస్‌ వంటి పలు షోలకు యాంకరింగ్‌ చేశాడు. ఇతడికి భార్య నిత్య సక్సేనా, కూతురు వియా ఉంది. మరి బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగు పెట్టిన రవి తన వాగ్ధాటితో ఎంతమందిని తనవైపు తిప్పుకుంటాడు? అనేది చూడాలి!

తొలి టాస్క్‌ విజేతగా సన్నీ
హౌస్‌లోకి వెళ్లిన తొలి ఐదుగురికి మ్యూజికల్‌ చైర్‌ మాదిరి టాస్క్‌ ఇచ్చాడు నాగ్‌. దీనికి ‘దండం వేసి దండం పెట్టు’ అని పేరు పెట్టాడు. మ్యూజిగ్‌ ఆగేలోపు ఎవరి దగ్గర పూలమాల(దండ) ఆగుతుందో వాళ్లు ఓడిపోయినట్లు అని చెప్పాడు. లహరితో ఈ గేమ్‌ మొదలైంది. ఆమె ఎవరి మెడలో దండ వేయలేకపోయింది. ఆ తర్వాత ఈ దండ సన్నీ చేతిలోకి వెళ్లింది. సన్నీ ఆ దండతో శ్రీరామ్‌ని తాకడంతో గేమ్‌ నుంచి ఔటయ్యాడు. అనంతరం సిరి చేతికి పూల మాల వెళ్లింది. ఆమె ఎవరికి వేయలేకపోవడంతో గేమ్‌ నుంచి నిష్క్రమించబడింది. చివరకు యానీ చేతికి వెళ్లగా, ఆమె కూడా ఎవరి మెడలో వేయలేకపోయింది. దీంతో ఈ గేమ్‌లో సన్నీ గెలిచి, మొదటి బెడ్‌ని అన్‌లాక్‌ చేసే పోటీలో నిలిచాడు. 

పకడో పకడో టాస్క్‌
హౌస్‌లోకి వెళ్లిన తొలి పది మందికి పకడో పకడో అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. నాలుగు జంతువులను నాలుగు రూమ్‌లో దాచి పెట్టి.. ఏ జంతువు శబ్దం వస్తే ఆ జతువును వెతికి పట్టుకోవాలని టాస్క్ ఇచ్చాడు బాస్. ఈ టాస్క్‌లో మొదటి రౌండ్ లో షణ్ముఖ్ , జెస్సీ ఓడిపోయారు. రెండో రౌండ్‌లో ప్రియాంక విన్ అయ్యింది.

సింగిల్ బెడ్ కోసం రోల్ బేబీ రోల్ టాస్క్‌
సింగిల్ బెడ్ కోసం మరో టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. దీనికి రోల్ బేబీ రోల్ అనే పేరు పెట్టాడు. నలుగురితో డైస్ వేయించి ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వారే విన్ అని చెప్పాడు బిగ్ బాస్. మొదటగా మానస్ డైస్ వేసాడు. ఆతర్వాత కాజల్ డైస్ వేసింది. ఆతర్వాత శ్వేతా వర్మ. చివరిగా రవి డైస్ వేసాడు. ఈ టాస్క్ లో మానస్ విన్ అయ్యాడు.

సోషల్‌ మీడియాలో లీకైన లిస్టే.. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకుల్లో అంతగా ఉత్కంఠ కనపడలేదు. స్టార్‌ మా బృందం కడవరకు సస్పెన్స్‌ మెయింటెన్‌ చేసినా కూడా లీకులు మాత్రం ఆగలేదు. 15 వారాల పాటు 19 మందితో సాగే ఈ షో.. రేపటి నుంచి కంటెస్టెంట్ల గొడవలు, ప్రేమలు, కోపాలు, అలకలతో రక్తికట్టించబోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement