Bigg Boss 5 Telugu: Serial Actor Uma Devi Confirms Her Entry In BB5 House - Sakshi

Bigg Boss 5 Telugu: ఎమోషనల్‌ పోస్ట్‌తో ఎంట్రీ లీక్‌ చేసిన నటి!

Sep 5 2021 3:44 PM | Updated on Sep 5 2021 7:55 PM

Bigg Boss 5 Telugu: Uma Devi Reveals Her Big Boss Entry With Emotional Post - Sakshi

Bigg Boss Telugu 5: బుల్లితెర వీక్షకుల ఎదురుచూపులకు తెరచిందే సమయం ఆసన్నమైంది. మరికొద్ది క్షణాల్లో కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న తెలుగు బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే షోలో అడుగుపెట్టేది వీరేనంటూ పలువురి పేర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్టులో బుల్లితెర, వెండితెర.. రెండింటా రాణిస్తున్న నటి ఉమాదేవి పేరు కూడా ఉంది. కార్తీకదీపం ద్వారా మరింత మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె తాజాగా తన ఎంట్రీని ముందే రివీల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది.

'ప్రతి అమ్మాయి ఏదో సాధించాలి అని చాలా కష్టపడుతుంది. ఎంతో ఇష్టంతో ఈ కెరీర్‌ను ఎంచుకున్నా. అప్పటినుంచి ఎన్నో మంచి సినిమాలు.. దాదాపు 100కు పైగా సినిమాలు చేశాను. ఇండస్ట్రీలో ఉన్న పాపులర్‌ కమెడియన్స్‌ అందరితో పని చేశాను. 15కు పైగా సీరియళ్లలో ఎన్నో మంచి పాత్రలు పోషించాను. వాటిలో చంద్రిక, రజిని, భాగ్యం అనే పాత్రలకి ఎంత ఆదరణ చూపించారో మర్చిపోలేను. చాలా ఎంకరేజ్‌ చేశారు. ఇప్పుడు నేను నేనుగా ఏంటో తెలుసుకోవడానికి మీకు తెలియజేయడానికి మరో కొత్త అడుగును మీసాక్షిగా వేస్తున్నాను. ఇలాగే సపోర్ట్‌ చేయండి. ఇలాగే నా వెనుక ఉండి, నన్ను సపోర్ట్‌ చేస్తారని కోరుకుంటూ, నేను ఎప్పటిలాగే మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి కష్టపడతాను. ఇది నా జీవితంలో వేస్తున్న 'బిగ్‌' స్టెప్‌. ఈ సర్‌ప్రైజ్‌ ఏంటో నేడే రివీల్‌ కానుంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా బిగ్‌బాస్‌ షోలో తన ఎంట్రీ ఉంటుందని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మీ ఎంట్రీ కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు సీరియల్‌ ప్రియులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement