Bigg Boss 6 Telugu: Chalaki Chanti Confirmed Contestant In BB Show - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌ ఎంట్రీని కన్‌ఫర్మ్‌ చేసిన బుల్లితెర కమెడియన్‌

Published Fri, Aug 19 2022 3:34 PM | Last Updated on Thu, Sep 1 2022 1:56 PM

Bigg Boss 6 Telugu: Chalaki Chanti Confirms BB Entry - Sakshi

బిగ్‌బాస్‌ వస్తుందంటే చాలు ఏ పనైనా పక్కనపెట్టి టీవీలకు అతుక్కుపోతారు బుల్లితెర ఆడియన్స్‌. ఈ రియాలిటీ షో అంటే అంతిష్టం ‍ప్రేక్షకులకు! టాస్కులు, గేములు, కోపతాపాలు, నవ్వులు, లవ్‌ స్టోరీలు, కొట్లాటలు.. ఇలా అన్నీ ఒకేచోట దొరుకుతాయి కాబట్టే బిగ్‌బాస్‌ షోకు ఫ్యాన్స్‌ ఎక్కువ. ఇప్పటివరకు ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో ఆరో సీజన్‌లో అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే ఆదిరెడ్డి, గీతూరాయల్‌, శ్రీహాన్‌, శ్రీసత్య, చలాకీ చంటి దీపిక పిల్లి, రేవంత్‌, అర్జున్‌ కల్యాణ్‌, ఆరోహి రావు, వాసంతి కృష్ణన్‌, సుదీప హౌస్‌లో అడుగు పెట్టబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఆర్జే సూర్య, మోహన భోగరాజు, నేహా చౌదరి, హీరోయిన్‌ ఇనయ సుల్తానా, అప్పారావు, తన్మయిలను బ్యాకప్‌ లిస్టులో చేర్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే తాజాగా బిగ్‌బాస్‌ ఎంట్రీపై చలాకీ చంటి స్పందించాడు. బిగ్‌బాస్‌ టీమ్‌తో దాదాపు చర్చలు అయిపోయాయి. కానీ ఇంకో రెండు విషయాలు మిగిలిపోయాయి. అవి రెండూ కంఫార్మ్‌ అయిపోతే ఇక అంతా ఓకే అయినట్లే' అని తాను బిగ్‌బాస్‌ షోలో పాల్గొంటున్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు.

చదవండి: ‘లైగర్‌లో ముందుగా ఆమెను హీరోయిన్‌గా అనుకున్నా’
మంచు విష్ణు 'జిన్నా' టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement