'బిగ్‌బాస్‌' నుంచి రతిక ఎలిమినేట్.. ఆ తప్పుల వల్లే ఇలా? | BB7 Telugu Day 28 Episode Highlights: Shivaji Asked Nagarjuna Over Why He Disqualified As Housemate, Rathika Elimination - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 28 Highlights: రతిక ఎలిమినేషన్.. ఎవరూ ఊహించలేదు!

Published Sun, Oct 1 2023 10:55 PM | Last Updated on Mon, Oct 2 2023 10:44 AM

Bigg Boss 7 Telugu Day 28 Episode Highlights - Sakshi

'బిగ్‌బాస్'లో వీకెండ్ ఎపిసోడ్ అంటే చాలు ఎవరో ఒకరు బలవ్వాల్సిందే. హా అదేనండి ఎలిమినేట్ అవ్వాల్సిందే అని చెబుతున్నాం. ఈ వారం కూడా అలానే ఊహించని ఓ కంటెస్టెంట్ బయటకెళ్లిపోయింది. అమెనే రతిక. టైటిల్ ఫేవరెట్ అనుకున్న ఈ హాట్ బ్యూటీ.. ఎలిమినేట్ అయ్యేసరికి కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకా ఆదివారం ఎపిసోడ్‌లో ఏమేం జరిగిందనేది Day-28 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అబ్బాస్, పృథ్వీరాజ్..!)

శివాజీ క్వశ్చన్- నాగ్ ఆన్సర్
శనివారం ఎపిసోడ్‌లో భాగంగా శివాజీని.. హౌస్‌మేట్‌గా అనర్హుడు అని అందరూ తీర్మానించారు. దీంతో అతడి పవరస్త్రని బిగ్‌బాస్ తీసేసుకున్నారు. అలా ఆ ఎపిసోడ్ ముగిసింది. తనని అనర్హుడని ఎందుకు చేశారో కారణాలు చెప్పాలని శివాజీ.. హోస్ట్ నాగార్జునని అడగడంతో ఆదివారం ఎపిసోడ్ మొదలైంది. దీంతో నాగ్.. శివాజీని నామినేట్ చేసిన వాళ్లని కారణాలు అడిగారు. శోభాశెట్టి, గౌతమ్, ప్రియాంక.. ఇలా అందరూ తమ తమ కారణాలు చెప్పారు. ఈ క్రమంలోనే శివాజీ మంచోడని బిగ్‌బాస్ ప్రొజెక్ట్ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే నాగార్జున హౌస్‌మేట్స్ గట్టిగానే కౌంటర్స్ వేశాడు.

సండే ఫండే
ఆదివారం ఎపిసోడ్ అంటేనే గేమ్ కంపల్సరీ. ఈసారి 'బొమ్మ గీయ్ గెస్ చేయ్' అని ఆట పెట్టారు. ఇందులో భాగంగా అందరినీ రెండు టీమ్స్‌గా విభజించారు. ఒక జట్టులోని ఒకరు వచ్చి బౌల్‌లోని చీటీ తీస్తారు. అందులోని పేరు ఆధారంగా బోర్డుపై బొమ్మ గీయాలి. ఆయా వ్యక్తికి సంబంధించిన టీమ్ మెంబర్స్.. బొమ్మ ఆధారంగా ఆ పేరు గెస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆటలో టీమ్-B(ప్రియాంక, అమరదీప్, యవర్, శోభాశెట్టి, ప్రశాంత్) విజయం సాధించింది.

(ఇదీ చదవండి: రతిక ఎలిమినేట్.. 'బిగ్‌బాస్'లో అలా జరగడం మొదటిసారి!)

రతిక ఎలిమినేట్
ఇక ఓవైపు గేమ్స్ ఆడుతూనే మధ్యమధ్యలో నాగ్ సేవ్ టాస్కు పెడుతూ వచ్చారు. అలా ప్రియాంక, యవర్, గౌతమ్, శుభశ్రీ వరసగా సేవ్ అయ్యారు. చివరగా తేజ, రతిక ఉండగా, వాళ్లని యాక్టివిటీ రూంకి పిలిచారు. ఆ తర్వాత రతిక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో హౌస్ నుంచి స్టేజీపైకి వచ్చిన ఆమె కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయింది. ఆమెకి హౌస్ నుంచి వీడ్కోలు పలికేటప్పుడు అందరూ ధైర్యం చెప్పారు. కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం చాలా సైలెంట్‌గా రతికని అలా చూస్తూ ఉండిపోయాడు. చివరగా యవర్, శివాజీ, సందీప్, శోభాశెట్టి, తేజ, శుభశ్రీలో నచ్చని లక్షణాలు చెప్పి వెళ్లిపోయింది. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది.

అదే కారణమా?
అయితే టైటిల్ ఫేవరెట్ అనుకున్న రతిక.. నాలుగో వారమే ఎలిమినేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. గ్లామర్ పరంగా బాగానే కంటెంట్ ఇచ్చినప్పటికీ ప్రశాంత్, యవర్‌తో ప్రేమగా నటిస్తూ, వాళ్లకే వెన్నుపోటు పొడవడం జనాలకు నచ్చలేదు. అలానే కొన్నికొన్ని విషయాలు ఈమె గొడవ పెద్దది చేస్తూ, దాన్నే సాగదీయడం లాంటి పాయింట్స్ కూడా రతికకు మైనస్ అయ్యాయి. అదే టైంలో పవరస్త్ర కోసం పెట్టిన గేమ్స్ లోనూ గెలవకపోవడం ఈమెకి మైనస్ అయిందని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: 'భీమ్లా నాయక్' నటి విడాకులు? పెళ్లయి ఏడాది తిరగకుండానే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement