'బిగ్‌బాస్ 7'లో పెద్ద ట్విస్ట్.. ఎలిమినేట్ అయిన ముగ్గురు రీఎంట్రీ | Bigg Boss 7 Telugu Promo Latest Rathika Damini Re Entry | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: అప్పుడు ఎలిమినేట్.. ఇప్పుడేమో తిరిగొచ్చి సర్‌ప్రైజ్

Published Sat, Oct 14 2023 6:51 PM | Last Updated on Sat, Oct 14 2023 7:03 PM

Bigg Boss 7 Telugu Promo Latest Rathika Damini Re Entry - Sakshi

గత సీజన్లలా కాదు ఈసారి ఉల్టా పుల్టా ఉంటది అనే ట్యాగ్ లైన్‌తో ఈసారి బిగ్‌బాస్ మొదలైంది. దీంతో ప్రేక్షకులు చాలా ఊహించుకున్నారు. కానీ రియాలిటీలో అంత సీన్ లేదు. ఎపిసోడ్స్ అన్నీ కూడా సో సోగా సాగుతున్నాయి. దాదాపు ఆరు సీజన్లలో ఎప్పుడూ లేని విధంగా వరసగా ఐదు వారాల్లో అమ్మాయిలు ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్లలో ముగ్గురు హౌసులోకి రీఎంట్రీ ఇచ్చారు.

(ఇదీ చదవండి: ఆమె కోసం ఈమె బలి? వచ్చిన వారంలోనే ఆ బ్యూటీ ఎలిమినేట్!)

క్లాస్ పీకిన నాగార్జున
గతవారం హౌసుకి కెప్టెన్‌గా రైతుబిడ్డ ప్రశాంత్ ఉన్నాడు. ఆ బాధ్యతలు ఇచ్చారు గానీ మనోడు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. కెప్టెన్సీ సరిగా చేయలేకపోతున్నావ్ అని స్వయంగా బిగ్‌బాస్‌తోనే చివాట్లు తిన్నాడు. తాజాగా ప్రిన్స్ యవర్.. హౌసుకి రెండో కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్సీ చేతికొచ్చేసరికి యాటిట్యూడ్ మొత్తం మారిపోయింది. అమరదీప్‌తో గొడవ పెట్టుకున్నాడు. దీనిపై నాగార్జున క్లాస్ పీకాడు. తాజా ప్రోమోలో అదే చూపించారు.

ఆ ముగ్గురు రీఎంట్రీ
ఇప్పటివరకు ఐదు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక, శుభశ్రీ వరుసగా ఎలిమినేట్ అ‍య్యారు. వీళ్లలో కొందరు ఎలిమినేట్ కావడం చాలామందికి షాక్‌కి గురి చేసింది. వీళ్లలో రతిక, దామిని, శుభశ్రీ మళ్లీ హౌసులోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రోమోలో వీళ్లు రావడం చూపించారు. అయితే జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసమని వీళ్లని తీసుకొచ్చారా? లేదా ఇంకేదైనా ప్లాన్ ఉందనేది తెలియాల్సి ఉంది. 

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్ల చేతికి మొబైల్‌ ఫోన్స్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement