మణికంఠ ఏడుపు ఆగిందో లేదో ఇటు విష్ణుప్రియ, సోనియాల పంచాయితీ మొదలైంది. ఇది రేపటి నామినేషన్ ముగిసేదాకా తెగేలా లేదు. కంటెస్టెంట్ల తప్పొప్పులు చెప్పే నాగ్ ఫస్ట్ వీక్.. అందర్నీ చూసీచూడనట్లు వదిలేశాడు. ఎవరినీ గద్దించలేదు, ఎవరినీ బుజ్జగించలేదు. ముందుగా ఊహించినట్లుగానే బేబక్కను ఎలిమినేట్ చేశారు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి.
ప్రైజ్‌మనీ ఎంతంటే?
నాగార్జున వచ్చీరాగానే గుడ్‌న్యూస్ చెప్పాడు. ఇప్పటివరకు జీరోగా ఉన్న ప్రైజ్‌మనీ.. హౌస్‌మేట్స్ పర్ఫామెన్స్ బట్టి పెరుగుతూ ఉంటుందన్నాడు. ఈ వారం రూ.5 లక్షల వరకు ఉండొచ్చన్నాడు నాగ్. కానీ హౌస్‌మేట్స్ ఇంగ్లీష్ మాట్లాడటం, హిందీ పాటలు పాడటం, సమయం సందర్భం లేకుండా నిద్రపోవడం వల్ల ప్రైజ్‌మనీకి అనేక కోతలు పెట్టి రూ.3 లక్షలుగా నిర్ణయించాడు. అనంతరం నామినేషన్‌లో ఉన్న శేఖర్ బాషా సేవ్ అయినట్లు ప్రకటించాడు.
ఫన్నీ గేమ్స్..
తర్వాత రెండు గేమ్స్ ఆడించగా మొదటిదానిలో అబ్బాయిలే గెలిచి సినిమాపిచ్చోళ్లమని ప్రూవ్ చేసుకున్నారు. రెండో గేమ్‌లో అమ్మాయిలు గెలిచారు. అలా గిఫ్ట్ హ్యాంపర్‌ను రెండు టీమ్స్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత నాగ్.. విష్ణుప్రియను సేవ్ చేశాడు. ఇక ఫన్నీ గేమ్స్ చాలంటూ నాగ్ ఓ సీరియస్ గేమ్ ఆడించాడు. హౌస్‌మేట్స్‌ను ఒకరిని ఒకరు జంతువులతో పోల్చుకోమని చెప్పాడు. దానికన్నా ముందు ఏ జంతువుది ఎలాంటి క్యారెక్టర్ అనేది తెలిపాడు.
బాషాకు కరెక్ట్ ట్యాగ్
నక్క- జిత్తులమారి, దోమ-చిరాకు, ఊసరవెల్లి-రంగులు మార్చడం, మొసలి- దొంగ కన్నీళ్లు, పిల్లి- స్వార్థం, గాడిద-తెలివితక్కువ, తేలు-నమ్మదగనిది, గొర్రె- గుడ్డినమ్మకం అని ఆ జంతువుల గురించి వర్ణించాడు. నబీల్ అఫ్రిది, అభయ్.. యష్మిది స్వార్థమంటూ పిల్లితో పోల్చారు. ప్రేరణ.. సీతను నమ్మడానికి వీల్లేదని తేలుతో పోల్చింది. కుళ్లుజోకులతో చిరాకు పుట్టిస్తాడంటూ నిఖిల్, ఆదిత్య, మణికంఠ ముగ్గురూ కూడా.. బాషాకు దోమ ట్యాగ్ ఇచ్చారు. దో.. మా (ఇద్దరు తల్లులు) అని మంచిగా పిలిచారని దాన్ని కూడా పాజిటివ్‌గా మార్చేశాడు బాషా.
తెలివి తక్కువ గాడిద..
యష్మి.. బేబక్క గొర్రెలా గుడ్డిగా అవతలివారిని ఫాలో అయిపోతుందని పేర్కొంది. నైనిక.. మణికంఠను నమ్మలేకపోతున్నానంటూ అతడిని తేలుతో పోల్చింది. పృథ్వీ.. బేబక్కను తెలివి తక్కువ గాడిదతో పోల్చాడు. టాస్క్‌లో ఓడిపోయినప్పుడు భవిష్యత్తులో మాట్లాడతానంది.. నా దృష్టిలో ఫ్యూచర్ అనేదే లేదు. ఒక వారంలోనే ఎలిమినేట్ అవొచ్చు. అలా తన సమయం వృథా చేసుకుంది. అలాగే నిఖిల్‌ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్తున్న ఆమె తనను తాను స్ట్రాంగ్ అని చెప్పుకోలేకపోయిందని కారణాలు చెప్పాడు.
బిగ్‌బాస్ షో 100 రోజులెందుకు?
దీంతో బేబక్క.. వచ్చిన ఒక్క రోజులోనే ఎవరి బలం ఏంటనేది ఎవరూ గ్రహించలేరు. అలా గ్రహించగలిగితే బిగ్‌బాస్ షో 100 రోజులెందుకు? ఒక్క రోజులోనే ముగించేయొచ్చుగా! అని ధీటుగా సమాధానమిచ్చింది. సోనియా.. జిత్తులమారి నక్క ట్యాగ్‌ను విష్ణుప్రియకు ఇచ్చింది. తనను ర్యాగింగ్ చేసిందని, ఏడుస్తుంటే కూడా పోక్ చేసిందని పేర్కొంది.
బేబక్క ఎలిమినేట్
అటు విష్ణుప్రియ.. నన్ను తిట్టి తను ఏడవడం అర్థం కాలేదంటూ సోనియావి మొసలి కన్నీళ్లు అని తెలిపింది. సీత.. నిఖిల్‌ను గుడ్డిగా ఫాలో అయిపోతుందంటూ ప్రేరణను గొర్రెతో పోల్చింది. బాషా.. యష్మిని జిత్తులమారి నక్కతో పోల్చాడు. బేబక్క.. తనను చూస్తే చాలు చిరాకు పడుతోందని సోనియాను చీమతో పోల్చింది. చివరగా నామినేషన్‌లో మణికంఠ, బేబక్క మిగలగా.. వీరిలో బేబక్క ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించాడు.
ఆ నలుగురికి అర్హత లేదు!
ఎంతమంది నిజంగా బేబక్కను మిస్ అవుతారని నాగ్ ప్రశ్నించగా.. ప్రేరణ, విష్ణుప్రియ, నైనిక, సీత, ఆదిత్య, అభయ్ చేతులెత్తారు. అనంతరం ఆనవాయితీ ప్రకారం షో నుంచి వెళ్లిపోయేముందు బేబక్కతో ఓ టాస్క్ ఆడించాడు. ఇంట్లో ఉండటానికి అర్హత లేనివారి ఫోటోలను రోడ్డు మీద పడేయమంది. నెగెటివ్ వైబ్స్ అంటూ సోనియాను, కోపం ఎక్కువగా ఉందని పృథ్వీ ఫోటోలను రోడ్డున పడేసింది.
బోరుమని ఏడ్చిన సీత
నిఖిల్ కోసం కూరలో కారం ఎక్కువ వేశాను.. దానివల్ల అందరూ ఇబ్బందిపడ్డారు. అతడి వల్లే బయటున్నానంటూ నిఖిల్ ఫోటోను రోడ్డున పడేసింది. ఒంటరిగా ఉంటూ నీలో నువ్వే టెన్షన్ పడుతున్నావంటూ మణికంఠ ఫోటోను నడిరోడ్డుపై వేసింది. బేబక్క వెళ్లిపోతుంటే సీత వెక్కి వెక్కి ఏడవటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment