
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తనకున్న క్రేజ్‌తో, అభిమానుల సపోర్ట్‌తో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో అడుగుపెట్టాడు. మొదట్లో కొంత గందరగోళానికి లోనైనా ఇప్పుడిప్పుడే కుదుటపడుతూ ఆట మొదలెట్టాడు. గేమ్ స్టార్ట్ చేశాడో లేదో ఫ్యాన్స్ అప్పుడే ఈ సీజన్ విన్నర్ షణ్ముఖ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల షణ్నూ గురించి మాట్లాడింది ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ. ఇద్దరి జర్నీ ఒకేసారి మొదలైందని చెప్పుకొచ్చింది.
షణ్ముఖ్ చాలా మంచివాడని, జెన్యూన్ పర్సన్ అని చెప్పుకొచ్చింది. ఎవరూ సపోర్ట్ చేయకున్నా సొంతంగా ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసి ఎదిగాడని మెచ్చుకుంది. అతడికి అంతా మంచే జరగాలని ఆశించింది. అయితే తాను బిగ్‌బాస్ షో చూడనని, కాబట్టి ఎవరినీ సపోర్ట్ చేయనని కుండబద్ధలు కొట్టింది. తనకసలు బిగ్‌బాస్ కాన్సెప్టే నచ్చదని, ఎప్పటికీ ఆ షోలో అడుగు పెట్టనని తేల్చి చెప్పేసింది విష్ణుప్రియ.
Comments
Please login to add a commentAdd a comment