Bigg Boss Telugu 5 Promo, Bommalo bhavishayathu: సండే వచ్చిందంటే చాలు నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు ఎలిమినేషన్ టెన్షన్‌తో నిలువెల్లా వణికిపోతుంటారు. ఆరో వారానికి గానూ ఆల్‌రెడీ ఒకరిని పంపించివేయడంతో ఈ టెన్షన్ రెట్టింపు అయింది. అయితే లోబోది ఫేక్ ఎలిమినేషన్ అని మనందరికీ తెలిసిందే. ఇదిలా వుంటే నామినేషన్స్‌లో 10 మంది ఉంటే అందులో లోబో ఇప్పటికే సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు. ఇంకా 9 మందిలో ఎవరినీ సేవ్ చేయలేదు నాగ్. అయితే వారి భవిష్యత్తును నిర్ణయించేందుకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నామినేషన్స్‌లో ఉన్నవారికి టెడ్డీబేర్స్ ఇచ్చి.. వాటిలో ఎవరి ఫొటో ఉంటుందో వాళ్లు ఎలిమినేట్ అయినట్లు అని ప్రకటించాడు.
దీంతో కంటెస్టెంట్లు ఊపిరి బిగపట్టుకుని బొమ్మలను ఓపెన్ చేసి చూస్తున్నారు. అయితే ఆల్‌రెడీ సోషల్ మీడియాలో శ్వేత ఎలిమినేట్ అయినట్లు లీక్ అవడంతో ప్రేక్షకులకు పెద్దగా సస్పెన్స్ లేకుండా పోయింది. ఇక ప్రోమో చివర్లో షణ్ను ఏడుస్తున్నట్లు చూపించారు. అంటే అందరూ ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వస్తుండగా చివరగా శ్వేత, సిరి మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. ఎక్కడ సిరి ఎలిమినేట్ అవుఉందోనన్న భయంతో షణ్ను కంటతడి పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో షణ్ను ఫ్యాన్స్.. 'అరె ఏంట్రా ఇది అంత ఎమోషనల్ అవుతున్నావు, సిరిని ఇప్పుడప్పుడే పంపించరులేరా!' అని ఓదార్చుతూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment