
Bigg Boss 5 Telugu Second Week Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం ఏడుగురు కంటెస్టెంట్లు కాజల్, లోబో, ప్రియాంక సింగ్, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, ప్రియ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో లోబో, యానీ మాస్టర్, ప్రియాంక సింగ్ సేఫ్ అయినట్లు నాగ్ శనివారం ఎపిసోడ్‌లో ప్రకటించాడు. దీంతో మిగతా నలుగురు నటరాజ్ మాస్టర్, ఉమాదేవి, ప్రియ, కాజల్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిలో ఉమాదేవి, నటరాజ్ మాస్టర్ ఓటింగ్‌లో చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం 'కార్తీకదీపం' ఫేమ్ అర్ధపావు భాగ్యం అలియాస్ ఉమాదేవి ఎలిమినేట్ అయిందట! ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్‌టైన్ చేసే ఆమెను నిర్దాక్షిణ్యంగా హౌస్ నుంచి పంపించివేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ బిగ్‌బాస్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు.
అందరి మీదా అరుస్తూ కంటెస్టెంట్లను హడలెత్తించే ఉమాదేవిని మొదటివారం సీరియస్ యాంగిల్‌లో అదీ కొంత నెగెటివ్‌గానే చూపించారు. కానీ ఈ వారం మాత్రం తనలోని కామెడీ యాంగిల్‌ను పరిచయం చేసి జనాలను కడుపుబ్బా నవ్వించిందీ ఉమా. అలాగే తనను ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా వారితో కలిసిపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు ప్రియాంక సింగ్, ఉమాల మధ్య జరిగిన గొడవే ఉదాహరణ. వీళ్లిద్దరి మధ్య ఎంతో పెద్ద గొడవ జరిగినప్పటికీ ఉమా తిరిగి పింకీకి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టి ఇట్టే కలిసిపోయింది. ఇక లోబోతో ఓవర్‌డోస్ కామెడీ చేస్తూ జనాలను నవ్విస్తోంది. కానీ బూతులు మాట్లాడటం, అందరితో గొడవలు పెట్టుకోవడమే ఆమె ఎలిమినేషన్‌కు కారణమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment