బిగ్‌బాస్‌ 7: ఊహించని సర్‌ప్రైజ్‌.. హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్లు! | Bigg Boss Telugu 7: New Contestants Will Enter to BB House after One Month | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న ఐదుగురు కంటెస్టెంట్లు.. ఎవరెవరంటే?

Published Sun, Oct 1 2023 2:51 PM | Last Updated on Mon, Oct 2 2023 12:18 PM

Bigg Boss Telugu 7: New Contestants Will Enter to BB House after One Month - Sakshi

బిగ్‌బాస్‌ షోలో నాగార్జున నిన్నటి ఎపిసోడ్‌లో విశ్వరూపం చూపించాడు. కొట్టకుండానే వాతలు పెట్టినట్లుగా వార్నింగ్‌లు ఇచ్చాడు. తప్పు చేసిన ఒక్కొక్కరికీ చుక్కలు చూపించాడు. దీంతో హౌస్‌లో సీరియస్‌ వాతావరణం నెలకొంది. అయితే ఆ పరిస్థితిని కూల్‌ చేసేందుకు రెడీ అయ్యాడు నాగ్‌. నేడు సండే అంటే ఫన్‌డే కావడంతో కంటెస్టెంట్లతో సరదా ఆటలు ఆడించాడు. ఈ మేరకు ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమో చివర్లో ఓ సర్‌ప్రైజ్‌ బయపెట్టాడు కింగ్‌. ఈ సీజన్‌లో ఎప్పుడూ, ఎక్కడా జరగనటువంటి విషయాలు జరగబోతున్నాయి. ఈ సీజన్‌ ఉల్టా పుల్టా అన్న విషయం గుర్తుంచుకోండి అని చెప్పుకొచ్చాడు.

ఇంతకీ ఆ సర్‌ప్రైజ్‌ ఏంటంటే.. మరో వారం రోజుల్లో బిగ్‌బాస్‌ 7 రెండో మినీ లాంచ్‌ జరగబోతోంది. అంటే మరికొందరు కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారన్నమాట! సీజన్‌ ప్రారంభంలో వినిపించిన పేర్లే ఇప్పుడు కూడా వినిపిస్తున్నాయి. అంబటి అర్జున్‌, భోలె షావళి, అంజలి పవన్‌, పూజా మూర్తి, నయని పావని హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్‌ నడుస్తోంది. మరి బిగ్‌బాస్‌ షోలోకి ఈ ఐదుగురే వస్తున్నారా? లేదంటే మరికొందరు సైతం రియాలిటీ షోలో పార్టిసిపేట్‌ చేయనున్నారా? ఈ లిస్టులో ఏమైనా మార్పులుచేర్పులు ఉన్నాయా అనేది వేచి చూడాలి!

ఇక వీరి ఎంట్రీని సరికొత్తగా ప్లాన్‌ చేస్తున్నారా? లేదంటే సడన్‌గా హౌస్‌లోకి పంపిస్తారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.  దాదాపు షో మొదలైన నెల రోజుల తర్వాత కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించేందుకు రెడీ అయింది బిగ్‌బాస్‌ టీమ్‌. మరి వీరి ఎత్తు ఏమేరకు పారుతుంది? కొత్త కంటెస్టెంట్లు ఇంట్లోవారితో కలిసిపోతారా? లేదంటే హౌస్‌లో ఉన్నవారే కొత్తవారిపై పైచేయి సాధిస్తారా? అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.

చదవండి: కాంగ్రెస్‌ కార్యాలయం ఎదుట నటిపై దాడి.. చేతులెత్తి వేడుకున్నా పట్టించుకోలేదన్న అర్చన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement