
ముంబై: సినిమా సెలబ్రిటీలు వారాంతాల్లో సరదగా గడుపుతుంటారు. వారు చేసిన సరదా పనులను అభిమానులతో పంచుకుంటారు. అటు వంటి ఓ ఫోటోను తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలో.. ఆలియా బికిని ధరించి ఈత కొలనులో ఈత కొడుతూ కనిపిస్తారు. ‘ఇది చాలా ఉత్తమైన రోజు’ అంటూ ఆమె కామెంట్ జతచేశారు. ఆలియా ఫోటోపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఆలియా అచ్చం సాగర కన్యలా ఉంది’ కామెంట్లు జత చేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే.. ఆలియా చివరగా సడక్-2లో కనిపించారు. ఇటీవల ఆలియా తన 28వ బర్త్‌డే జరుపుకున్న విషయం తెలిసిందే.
అదే విధంగా గత నెలతో ఆలియా తన స్నేహితురాలు ఆకాన్షా రంజన్ కపూర్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇక ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీతో ఆలియా భట్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో రామరాజు పాత్ర పోషిస్తున్న రామ్‌చరణకు జోడిగా నటిస్తున్నారు. ఇటీవల ఆలియా పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రం బృందం విడుదల చేసింది. ఆ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
చదవండి: రామరాజు కోసం నిరీక్షిస్తున్న సీత
Comments
Please login to add a commentAdd a comment