Britney Spears Ex-Husband Alexander Charged For Trying To Crash Her Wedding - Sakshi
Sakshi News home page

Britney Spears: సీక్రెట్‌గా సింగర్‌ పెళ్లి, ఆపేందుకు ప్రయత్నించిన మాజీ భర్త

Published Fri, Jun 10 2022 5:20 PM | Last Updated on Fri, Jun 10 2022 7:21 PM

Britney Spears Ex Husband Alexander Charged For Trying To Crash Her Wedding - Sakshi

పాప్‌ సింగర్‌ బ్రిట్నీస్పియర్స్‌ మూడో పెళ్లి చేసుకుంది. రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఆమె తన ప్రియుడు సామ్‌ అస్ఘరిని సీక్రెట్‌గా పెళ్లాడింది. పెళ్లి చేసుకునే సమయానికి బ్రిట్నీ వయసు 40 ఏళ్లు కాగా సామ్‌ వయసు 28 ఏళ్లే కావడం గమనార్హం. అయితే వీరి వివాహాన్ని అడ్డుకునేందుకు సింగర్‌ మాజీ భర్త అలెగ్జాండర్‌ విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. బ్రిట్నీ స్పియర్‌ ఎక్కడ? ఆమె నాకున్న ఒకే ఒక్క భార్య అంటూ గురువారం వీరి పెళ్లి వేదిక మీదకు తోసుకుంటూ రాగా పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసినట్లు వెరైటీ మీడియా ఓ కథనంలో రాసుకొచ్చింది.

కాగా 2004లో బ్రిట్నీస్పియర్స్‌ తన చిన్ననాటి స్నేహితుడు అలెగ్జాండర్‌ను పెళ్లి చేసుకుంది. కానీ 55 గంటలకే వీరు విడిపోయారు. ఆ తర్వాత కెవిన్‌ ఫెడర్‌లైన్‌ను పెళ్లాడగా వీరికి సీన్‌, జైడెన్‌ అని ఇద్దరు కుమారులు సంతానం. 2007లో కెవిన్‌కు విడాకులిచ్చేసింది బ్రిట్నీ. ఆ తర్వాత 2016లో స్లంబర్‌ పార్టీ అనే వీడియో సాంగ్‌లో తనతో పాటు కలిసి నటించిన సామ్‌ అస్ఘరితో ప్రేమలో పడింది. వీరిద్దరూ గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు. అంతేకాదు, ప్రియుడితో కలిసి త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు గుడ్‌న్యూస్‌ చెప్పిన సింగర్‌ అంతలోనే గర్భస్రావం అయిందని సోషల్‌ మీడియాలో పేర్కొంది. 

చదవండి: ఆ ప్రశ్నకు నేనెప్పుడూ సిద్ధమే: కమల్‌ హాసన్‌
‘అందరి మనసుల్లోని ప్రశ్నలను గాడ్సే ప్రశ్నించబోతున్నాడు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement