ఫోటోగ్రఫీ అనేది ఒక గొప్ప కళా. అందమైన జ్ఞాపకం. గడిచిన కాలాన్ని తిరిగి పొందలేకపోవచ్చు కానీ.. మన జీవితంలో గడిపిన మధుర క్షణాలను ఫోటోల రూపంలో భద్రపరుచుకోవచ్చు. ప్రతి ఫోటో వెనక ఏదో ఒక అనుభూతి దాగి ఉంటుంది. అది మంచి అయినా చెడు అయినా.. ఆ ఫోటోలు చూస్తే మన మదిలో ఆ నాటి కాలపు మధురానుభూతులు మదిలో మెదులుతాయి. అయితే నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఫోటోగ్రాఫర్లు తమ ఫోటోలతో ప్రపంచంలోని అద్ఛుతాలను బంధించి వాటిని ప్రపంచానికి పరిచయం చేసే గొప్పకళ గురించి తెలియజేయడమే ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం. (ఆ మాటలు నాకెంతో తృప్తినిచ్చాయి: చిరంజీవి)
నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తాము తీసిన కళాత్మక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు. తను మొదటిసారి కెమెరాతో తీసీన ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘నేను తీసిన మొదటి ఫోటో.. ఈ అయిదుగురిలో ఒ వ్యక్తి మీకు బాగా తెలుసు.. చెప్పుకోండి చుద్దాం’ అంటూ సవాలు విసిరారు. ఇక ఈఫోటోపై అభిమానులు భారీగా స్పందిస్తూ... మధ్యలో ఉంది పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అని కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఆ ఫోటోలో ఉంది పవనో కాదో మీరు కూడా గుర్తుపట్టండి. (చిరు ఫ్యాన్స్‌కు పండుగే.. డబుల్ ధమాకా!)
నేను తీసిన మొదటి ఫోటో ... ... ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు ... ...చెప్పుకోండి చూద్దాం. #FirstPhotoTaken #WorldPhotographyDay pic.twitter.com/YyesoiiivX
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 19, 2020
Comments
Please login to add a commentAdd a comment