సినీ దర్శకుడు భారతీరాజాను శనివారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న భారతీ రాజా రెండు వారాలు ఆస్పత్రిలో చికిత్స పొంది శుక్రవారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.
చికిత్స పొందుతున్న సమయంలో సీఎం స్టాలిన్ ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి భారతీ రాజా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సీఎం స్టాలిన్ నీలాంగరైలోని భారతీ రాజా ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. ఆయనతో పాటు డీఎంకే నాయకులు, సినీ గీత రచయిత వైరముత్తు ఉన్నారు.
చదవండి: (Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment