
చెన్నై : ప్రముఖ హాస్య నటుడు వడివేల్ బాలాజీ కన్నుమూశారు. ఇటీవల గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన వడివేల్ చికిత్స పొందుతూ ఈ రోజు(గురువారం)ఉదయం తుదిశ్వాస విడిచారు. చిన్న వయస్సులోనే బాలాజీ అకస్మికంగా మృతి చెందడంతో తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అధు ఇడు ఎడు, కలకపోవతు యారు వంటి టెలివిజన్ షోలతో వడివేల్ బాలాజీ పాపులర్ అయ్యారు. వడివేల్ బాలాజీకి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. (కంగన ఆఫీస్ కూల్చివేత.. గవర్నర్ సీరియస్! )
ప్రైవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్న బాలాజీని ఆ తరువాత కుటుంబ ఆర్థిక కారణాల వల్ల అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన వడివేలు అక్కడ 15 రోజులపాటు చిక్సి పొందుతూ మరణించాడు. కాగా కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో కూడా సహ్యానటుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వార్తలు వెలువడ్డాయి. (సినిమా ఉన్నంతవరకూ.. జయప్రకాశం)
వడివేల్ బాలాజీ తమిళంలో కొన్ని చిత్రాల్లోనూ నటించారు. ప్రముఖ హాస్యనటుడు వడివేల్‌ను అనుకరిస్తూ నటించినందుకు బాలాజీ అనేక ప్రశంసలు పొందారు. దురైలో జన్మించిన ఈ నటుడు 1991 లో విడుదలైన ఎన్ రాసవిన్ మనసిలే అనే చిత్రంతో తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టారు.వడివేల్ చివరిసారిగా నయనతార నటించిన హిట్ చిత్రం కోలమావు కోకిలాలో కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment