ధనుష్‌ కామెంట్స్‌.. జూ. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫిదా | Actor Danush Comments On JR NTR In Raayan Pre Release Event, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

ధనుష్‌ కామెంట్స్‌.. జూ. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫిదా

Published Mon, Jul 22 2024 8:07 AM | Last Updated on Mon, Jul 22 2024 9:27 AM

Danush Comments On JR NTR

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌కు తెలుగులో కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కూడా టాలీవుడ్‌ హీరోలతో పాటు ఇక్కడి ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు. తెలుగులో ఒక స్టార్‌ హీరోతో కలిసి పనిచేయాలనే కోరిక తనలో ఉందని తాజాగా ధనుష్‌ చెప్పాడు. సార్‌ సినిమాతో తెలుగులో మరింత ఇమేజ్‌ పెంచుకున్న ధనుష్‌ తాజాగా  రాయన్‌తో థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఇందులో ఆయన హీరోగా నటిస్తూనే  స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కళానిధి మారన్‌ నిర్మించారు. సందీప్‌ కిషన్, కాళిదాస్‌ జయరామ్, అపర్ణ బాలమురళి, ప్రకాశ్‌రాజ్‌,నిత్యా మీనన్‌,ఎస్‌ జే సూర్య,సెల్వరాఘవన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జులై 26న రాయన్‌ విడుదల కానుంది.

‘రాయన్‌’ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో  ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ నిర్వహించారు. ఈ వేడుకలో టాలీవుడ్‌ హీరోల గురించి ఎదురైన ప్రశ్నలపై ధనుష్‌ స్పందించారు. ఒకవేళ మల్టీస్టారర్‌ మూవీ ఛాన్స్‌ వస్తే రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, మహేశ్‌ బాబు, ఎన్టీఆర్‌.. వీరిలో ఎవరితో కలిసి నటిస్తారు..? అనే ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన వెంటనే జూ.ఎన్టీఆర్ అని బదులిచ్చారు. దీంతో తారక్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఎవరైనా తమ హీరోతో కలిసి నటించాలని కోరుకుంటారని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

‘రాయన్‌’ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో జులై 26న విడుదల కానుంది. తెలుగులో ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ద్వారా రిలీజ్‌ అవుతోంది. ధనుశ్ కెరీర్​లో 50వ చిత్రంగా ఇది తెరకెక్కడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement