Darshan Fake Loan Case: Aruna Kumari Allegations Producer Umapathy - Sakshi
Sakshi News home page

Darshan Fake Loan Case: నన్ను వాడుకున్న నిర్మాతకు నేనెవరో తెలియదా?

Published Wed, Jul 14 2021 7:24 AM | Last Updated on Wed, Jul 14 2021 1:23 PM

Darshan Fraud Loan Case: Aruna Kumari Allegations On Umapathy - Sakshi

దర్శన్‌, అరుణాకుమారి, ఉమాపతి

యశవంతపుర(కర్ణాటక): నటుడు దర్శన్‌ పేరుతో నకిలీ పత్రాలను రూపొందించి రూ. 25 కోట్ల లోన్‌ తీసుకునే కుట్ర మలుపు తిరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ అరుణాకుమారి బెంగళూరులో మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. లోను విషయంలో నిర్మాత ఉమాపతి తనను వాడుకొని వదిలేశారని ఆరోపించారు. తాను ఎవరో తెలియదని ఆయన చెప్పడం నిజం కాదన్నారు. మార్చి 30 నుంచి అతనితో పరిచయం ఉందని ఆమె చెప్పారు.

'లోన్‌ విషయమై ఉమాపతిని కలిసిన మాట నిజం. అయితే లోన్‌ రాలేదు. దర్శన్‌ ఫాంహౌస్‌కు కూడా వెళ్లాను. దర్శన్‌–ఉమాపతి నడుమ ఏం జరిగిందో నాకు తెలియదు. వీరి ద్వారా నాకు ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయి. నా కుటుంబం ఆత్మహత్య చేసుకొనే స్థితికి వచ్చింది. దయచేసి నన్ను బతకనివ్వండి' అని పేర్కొన్నారు. తాను వాట్సప్‌లో హార్ట్‌ సింబల్‌ను ఉమాపతికి పంపడంపై చర్చ అవసరం లేదన్నారు. తన అన్నదమ్ముళ్లకు కూడా ఇలాంటి సింబల్‌ను పంపినట్లు తెలిపారు. 

ఆమె తెలుసు: ఉమాపతి
నటుడు దర్శన్‌ తనపై ఆడియోను రిలీజ్‌ చేయటంపై నిర్మాత ఉమాపతి బెంగళూరులో తన ఇంట్లో స్పందించారు. నేను ఎప్పుడూ దర్శన్‌ గురించి అనుచితంగా మాట్లాడలేదన్నారు. 'అరుణాకుమారి ఏప్రిల్‌ నుంచి తెలుసు. మే మూడో వారంలో దర్శన్‌ లోన్‌ విషయమై ఆమె, నేను మాట్లాడుకున్నాం. నేను దర్శన్‌ను దూరం చేసుకోను' అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement