మరో హిట్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇది తెలుగు కాదు కన్నడ సినిమా. ప్రభాస్ 'సలార్'తో పోటీ పడి కర్ణాటకలో ఈ చిత్రానికి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. స్టోరీ పరంగా చూసుకుంటే పెద్ద మెరుపులేం లేనప్పటికీ కన్నడ ప్రేక్షకులకు నచ్చేసింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయిందట. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు?
ప్రస్తుతం అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అలానే పలువురు రీజనల్ హీరోలు కూడా యాక్షన్ సినిమాలు తీస్తూ వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నారు. అలా కన్నడలోనూ హీరో దర్శన్ ఉన్నాడు. యాక్షన్ సినిమాలు తీసే ఇతడు గతేడాది డిసెంబరులో 'సలార్' చిత్రం థియేటర్లలోకి వచ్చిన వారం తర్వాత అంటే డిసెంబరు 29న 'కాటేరా' అనే మూవీతో వచ్చాడు. సూపర్హిట్ కొట్టేశాడు.
(ఇదీ చదవండి: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?)
విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సాధారణ కథనే అయినప్పటికీ కన్నడ ఆడియెన్స్‌కి ఎక్కేసింది. కర్ణాటకలో 'సలార్' కంటే ఈ చిత్రాన్నే ఎక్కువగా చూశారు. అలా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఎప్పుడనేది డేట్ ఇంకా తెలీదు గానీ ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 9న జీ5లో రిలీజ్ చేయొచ్చని టాక్ అయితే నడుస్తోంది.
ఒకవేళ ఓటీటీ రిలీజ్ చేస్తే తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావొచ్చని అంటున్నారు. మరి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. అలానే 'కాటేరా' తెలుగు వెర్షన్ థియేటర్ రిలీజ్ ఉందా లేదా? అనేది కూడా స్పష్టత రావాలి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment