భర్త కోసం ఆ పాత్ర ఒప్పుకున్న దీపిక | Deepika Padukone To Played Guest Role In Cirkus Movie | Sakshi
Sakshi News home page

శ్రీవారి కోసం ఆ చిన్న పాత్రలో దీపికా పదుకొనె

Published Sat, Feb 20 2021 9:11 AM | Last Updated on Sat, Feb 20 2021 11:46 AM

Deepika Padukone To Played Guest Role In Cirkus Movie - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌ సర్కస్‌కి వెళ్తున్నారట.. అది కూడా కేవలం అతిథిగా మాత్రమే. మరి ఈ అతిథి ఏం చేస్తారో చూడాలి. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సర్కస్‌’. పూజా హెగ్డే, జాక్వెలిన్‌ కథానాయికలు. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాలో చిన్న పాత్రలో మెరవనున్నారట రణ్‌వీర్‌ సింగ్‌ భార్య దీపికా పదుకోన్‌. శ్రీవారి కోసం ఆ చిన్న పాత్ర చేయడానికి ఒప్పుకున్నారని టాక్‌. పెళ్లి తర్వాత వీరిద్దరూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న రెండవ చిత్రం ‘సర్కస్‌’. ఇప్పటికే ‘83’ సినిమాలోనూ వీరిద్దరూ జంటగా నటించారు.

చదవండి : 
శంకర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్ 

ఆ ఆలోచనైతే ఉంది..కానీ..: నిత్యామీనన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement