
యూట్యూబర్స్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనాల ప్రేమ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు తమ ప్రేమ విషయాన్ని బహిరంగానే ప్రకటించారు. ఒకరిపేరు ఒకరు టాటూగా కూడా వేయించుకున్నారు. ప్రస్తుతం షణ్ముఖ్ బిగ్‌బాస్ -5 హౌస్‌లో ఉండగా, దీప్తి సునయన బయట ఫుల్ ప్రమోషన్స్ నిర్వహిస్తూ అతన్ని బిగ్ బాస్ విన్నర్‌ని చేయడానికి గట్టిగానే కష్టపడుతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షణ్ముఖ్‌కు సంబంధించిన స్పెషల్ వీడియోలను పోస్ట్ చేస్తూ భారీ ఓట్లు పడేలా చేస్తోంది. మధ్య మధ్యలో షన్నూతో క్లోజ్‌గా దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. తనపై ఉన్న ప్రేమను బయటపెడుతోంది.
మరోవైపు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న షణ్ముఖ్ ప్రతి క్షణం దీప్తి గురించే ఆలోచిస్తున్నాడు. ఇతరు ఇంటి సభ్యులకు దీప్తి గురించి చెబుతూ.. సంబరపడిపోతున్నాడు. తను పంపించి స్పెషల్ గిఫ్ట్‌లను ఎవరైనా టచ్ చేస్తే అసలు సహించడం లేదు. ఇలా ఇద్దరు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అతున్నారు.
కాగా, తాజాగా దీప్తి నెటిజన్స్‌తో ముచ్చటిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ‘అక్కా.. నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో షన్నుని ఎందుకు ఫాలో కావడం లేదు’అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దీప్తి క్లారిటీ ఇచ్చింది. తామిద్దరం అప్పటి వరకు ఒకరినొకరం ఫలో కావొద్దని ఫక్స్ అయ్యామని చెప్పింది. అంతేకాదు మరోసారి ఇలాంటి ప్రశ్నలను అడక్కండంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే వాళ్లు ఎప్పటి వరకు ఒకరినొకరు ఫాలో కాకుండా దూరంగా ఉంటారనేది మాత్రం చెప్పలేదు. బహుశా పెళ్లి చేసుకునే వరకు అలా దూరంగా ఉండాలనుకున్నారేమోనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.