
అందరి బుర్రలను చదివే అపర మేధావి.. ఆచితూచి అడుగువేసే గేమ్ ప్లానర్... అనవసరంగా గొడవలు పెట్టుకోని మిస్టర్ కూల్.. ఫ్రెండ్ కోసం, ఫ్రెండ్‌షిప్ కోసం ఎంతకైనా తెగించే మనసున్న వ్యక్తి షణ్ముఖ్ జశ్వంత్. ఎంతో క్రేజ్‌తో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో అడుగుపెట్టిన ఇతడు ఎంతో నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వచ్చాడు. ఐదేళ్లుగా దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నానన్న అతడు బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రం సిరికి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నానంటూ ఆమెకు హగ్గులిస్తూ అప్రతిష్ట మూటగట్టుకున్నాడు.
ఏకంగా సిరి తల్లి వచ్చి హగ్గులివ్వడం నచ్చలేదన్నప్పటికీ వీళ్లిద్దరూ తీరు మార్చుకోలేదు. ఇది జనాలకు అస్సలు నచ్చలేదు. ఆమె తల్లి మాటకు గౌరవం ఇవ్వాల్సిందని షణ్ను మీద అసంతృప్తి వెళ్లగక్కారు. అయితే బయటకు వచ్చిన షణ్ను మాత్రం తమది ఫ్రెండ్‌షిప్ అని క్లారిటీ ఇస్తూ అందరి నోళ్లు మూయించాడు. కానీ సిరి వల్లే తాను ఓడిపోయి రెండో స్థానంలో ఉన్నానని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ షోలో షణ్ను ప్రవర్తనతో అతడి ప్రేయసి, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ దీప్తి సునయన హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్న పోస్టులతో అభిమానుల్లో రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి.
ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో 'కనీసం నీ మనస్సాక్షితోనైనా నిజాయితీగా ఉండు' అని రాసుకొచ్చింది. 'నా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారాయని తెలిసినప్పటికీ నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా', 'ఈ సంవత్సరం నాకేమీ బాగనిపించలేదు. కానీ చాలా నేర్చుకున్నాను..' అంటూ వరుస పోస్టులు పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు షణ్ను-దీప్తిల రిలేషన్ బాగానే ఉందా? అంటూ ఆరా తీస్తున్నారు. దీప్తి పోస్టులు చూస్తుంటే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకునేలా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఊహాగానాలపై షణ్ను, దీప్తిలు ఏమని స్పందిస్తారో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment