Deepthi Sunaina Strong Reply To Netizen Question, Details Inside - Sakshi
Sakshi News home page

Deepthi Sunaina : 'అంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది'? నెటిజన్‌ ప్రశ్నకు దీప్తి సునయన కౌంటర్‌

Published Mon, Feb 6 2023 12:35 PM | Last Updated on Mon, Feb 6 2023 1:18 PM

Deepthi Sunaina Shares How She Buys New Home - Sakshi

సోషల్ మీడియా స్టార్‌ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కవర్‌ సాంగ్స్‌, డబ్స్‌ మ్యాష్‌తో గుర్తింపు పొందిన దీప్తి బిగ్‌బాస్‌ సీజన్‌-2లో పాల్గొని మరింత పాపులర్‌ అయ్యింది. రీసెంట్‌గా ఏమోనో అనే కవర్‌ సాంగ్‌తో ఆకట్టుకుంది. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దీప్తి సునయన తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నెటిజన్లతో ముచ్చటించింది.

ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. అయితే ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు మాత్రం అదిరికపోయే కౌంటర్‌ ఇచ్చింది. మీరు కొత్త ఇల్లు కొన్నారు కదా అంత డబ్బు ఎక్కడది అని నెటిజన్‌ అడగ్గా.. యూట్యూబర్‌గా కెరీర్‌ ఆరంభించినప్పటి నుంచి నేను సంపాదించిన దాంట్లో ముప్పై శాతం ఖర్చు పెట్టుకొని మిగతా డెబ్బై శాతం సేవ్‌ చేసుకున్నాను. అలా దాచుకున్న డబ్బులతో ఇల్లు కొన్నాను అంటూ కౌంటర్‌ ఇచ్చింది. ఇక రీసెంట్‌గా కొత్త ఇంట్లోకి కూడా షిఫ్ట్‌ అయినట్లు ఆమె చెప్పుకొచ్చొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement